Tuesday, April 24, 2012

మన ఆకు కూరలు,తినదగిన పూలు, కూరగాయలు


మన ఆకు కూరలు : Our leafy vegetables and vegetables.(REVISED)
Inspiration : ఆంద్ర ప్రదేశ్ లో ఆకు కూరలు -A book published by Telugu Academy.
I wish to introduce some non traditional leafy vegetables to the present generation. These leaves were cooked by our elders to prevent or alleviate some health problems at least once or twice in the year. Let me introduce them with photographs and botanical names and vernacular names:
1. Our traditional leafy vegetables are in common use: They are తోటకూర, తెల్ల గోంగూర, ఎర్రగోంగూర(పుంటి కూర );చుక్కకూర,తీగ బచ్చలి, చిర్రి కూర, మొలక కూర/ దంటు కూర ,కొయ్యగూర, పెరుగుతోటకూర, పాలకూర ; మెంతికూర, పుదినా, కొత్తిమిర; కరివేపాకు, ఉల్లి కాడలు, కాబేజీ ,సోయకూర, చింతచిగురు. ఇవి కాక మరెన్నో ఆకులను కూడా తిన వచ్చును . అవి అంతగా వాడుక లో లేవు, వాటిని సంప్రదాయేతర ఆకు కూర లు అంటారు. అవి ఆరోగ్య ప్రదాయనులు. వాటి గురించి మీ అమ్మమ్మ లేదా బామ్మ లను అడిగితే చెప్తారు. వాటిని పరిచయం చేయాలని అనిపించి ఈ సమా చారం ఇస్తున్నా.
వీటిలో ఒక్కో ప్రాంతం లేదా జిల్లా లో కొన్నిటిని తింటారు, నెల్లూరు లో తినే వాటిని గోదావరి జిల్లాల్లో తినరు లేదా తింటారని తెలియక పోవచ్చు, కానీ తెలుగు వాళ్ళు వాడే ఆకులన్నిటిని పరిచయం చేస్తున్నాను.ఇవి విషం కావు, కానీ కొందరికి అలెర్జీలు రావచ్చు, అపుడు మానెయ్యండి. ఈ ఆకులను కలిపి వండుకోవచ్చు; వీటిని కలగూర అంటారు . ఆకులు సేకరించేటప్పుడు మురికి గుంటల వద్ద కాక పొలం గట్ల వద్ద నుండి సేకరించండి.          
Non traditional leafy vegetables which have been in use by some people only; and they may be used by any one if found in unpolluted areas for the same advantages that our elders got. All most all these leafy vegetables contain considerable amount of Calcium, Iron and Phosphorous.         
Family: Amaranthaceae
1.పొన్నగంటి కూర:
Botanical name: Alternanthera sessilis (L.) R.Br.; 
Common in moist areas along the canals and ponds.
It is rich source of Iron, Phosphorus, Calcium , Riboflavin and Carotene.
Alternanthera sessilis ( పొన్నగంటి కూర)
It is tasty and good for skin and eyes.
Alternanthera philoxeroides
But now cultivated ponnaganti is sold in markets which is nothing but Alternanthera philoxeroides (Mart.) Griseb.; it is an accumulator of heavy metals like Cadmium and Mercury in the surrounding water, when it is eaten metal poisoning may cause some serious problems.
2.ఉత్తరేణి ఆకు : అపామార్గము
Uttareni:Botanical name: Achyranthus aspera L.It is useful to remove worms in the stomach. The shade dried powder is used to relieve phlegm. It can be cooked with tamarind and dal.
ఉత్తరేణి Achyranthus aspera 
3.పిండి కూర:Pindikura:
Botanical name:  Aerva lanata L. Those who are suffering from urinary stones used to eat it, as it dissolves or prevent formation of stones. It can be coked with dal; only tender leaves are to be cooked like Amaranth or Alternanthera
పిండి కూర
4.అడవి గురుం గూర:
Adavigurungura: Botanical name: Allmania nodiflora(L.)R.Br It can be cooked with dal like Aerva .
Allamania nodiflora; అడవి గురున్గూర 

5.చిలక ముక్కాకు:
 Botanical name: Amaranthus viridis L. It can be cooked with dal like thotakura, it tastes almost thotakura like. It  relieves  worms  in  stomach.   
Amaranthus viridis ;చిలక ముక్కాకు 
6. ముళ్ళ తోట కూర:
Botanical name: Amarantus spinosus L.- It contains carotene, Vit.C; improves apettite, It is tasty also.and improves lactation in newly delivered mothers. బాలింతల కు క్షీర వర్ధిని;only leaves without spines have to be cooked)
ముళ్ళ తోట కూర
7.గురుగు/ గురుంగూర: (బతుకమ్మ పూలు ) 
Botanical name: Celosia argentia L. లేత ఆకులు వండుకుంటారు. It can be cooked with dal, In Telangana districts the plant is used to decorate Bathukamma.

గురుగు Celosia 
8.చెంచలాకు:
Chenchallaku:Botanical name:  Digera muricata (L.) Mart ,It can be cooked with dal
 Digera muricata; చెంచాలాకు 
9. పప్పుకూర :చక్రవర్తికూర,
ఇది పొలాల్లో కలుపు లాగ పెరుగుతుంది.   
Botanical name: Chenopodium album L. 
It can be cooked like Amaranthus 
Chenopodium album
Family Brassicaceae
నల్ల ఆవాల ఆకు :Brassica nigra L.,   
లేత ఆవకూరను రాజస్థాన్, పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాల్లో  పప్పుతో కలిపి వండుకుంటారు ;
 ముల్లంగి (Raphanus sativus L.) ఆకులను ఉత్తర భారత దేశము లో వండుతారు. కాలీ ఫ్లవర్ (Brassica oleracea L.)ఆకులను కూడా వండు కోవచ్చు. ఇవి రుచికరంగా ఉంటాయి   
Family : Portulacaceae
వంగరేడుకూర Vangaredukura: Botanical name:  Sesuvium portulacastrum (L.) During famine times the fishermen community used to cook these leaves and eat to satiate their hunger. Instead of adding salt this plant is cooked with fish or crabs or some other dishes by the local fishermen.(ఒక సారి ఉడకబెట్టి ఆ నీరు వంపేసి తరువాత వాడుకోవాలి) 
Sessuvium portulacatstrum; 
2.పప్పు కూర,గంగబాయలి కూర, పాయలాకు :
 Pappukura, Gangabailikura, Payallaku: Botanical name:Portulaca oleracea L. Var oleracea Can be cooked with dal.It contains carotene, riboflavin,vit.C, and oxalic acid; It is useful in kidney and liver diseases శరీరం లో నీరు పట్టి నపుడు ఉపయోగం గా వుంటుంది.
గంగాబాయిలి కూర 
బడ్డు:Baddu : Botanical name:Portulacatuberosa L.Can be cooked with dal
Portulaca tuberosa; బడ్డు కూర 
Family: Aizoaceae
తెల్ల గలిజేరు:Tellagalizeru:
 Botanical name: Trianthema portulacastrum L. There are 2 varieties, one is white another one is reddish; both are edible.It is useful for diabetic patients.It can be cooked with dal.It contains considerable amount of carotene and Vit.C; It contains oxalates, hence it is not advisable for those who are prone to kidney stones; and for pregnant women.
తెల్ల గలిజేరు 


గలిజేరు 

Family: Lamiaceae

తుమ్మి కూర:Thummikura:
Botanical name: Leucas aspera Willd. It is eaten to relieve respiratory problems. తుమ్మి కూరతో లేత చింత కాయలు కలిపి వండుతారు. It can be cooked with Redgram and tamarind. దక్షిణ కోస్తా, రాయల సీమ లో కార్తీక మాసం లో, వినాయక చవితి కి తెలంగాణా లో, శివ రాత్రి కి చాలా ప్రాంతాల్లో వండుకుంటారు.   eating this leafy vegetable is  a tradition in some communities after the fast. 
Leucas aspera; తుమ్మి కూర

వామాకు / కప్పు రెల్లి/కర్పూర వల్లి  ఆకు :
 Botanical name: Coleus ambonicus ; It can be used in variety dishes, such as salads etc., It relieves stomach ache, cough and cold.
Coleus, వామాకు 
Family: Apiaceae
కొత్తిమీర ఈ కుటుంబానికి చెందిందే 
సరస్వతి ఆకు: Saraswathiaaku:
Botanical name:  Centella asiatica L.It is a proven Ayurvedic medicinal plant. used to improve memory in children. It is cooked as chutney. 
Centella asiatica; సరస్వతి ఆకు 
 Anethum sowa Roxb. ex Fleming  : సోయకూర, పెద్ద సదాపార:ఇది జిలకర ఆకు లాగా ఉంటుంది. తెలంగాణా లో దీన్ని బాగా వాడతారు. 
నల్లేరు :
Botanical name: Cissus quadrangularis L. ;Family: Vitaceae
  young shoots along with leaves cooked; a mdeicinal herb to strengthen bones. దీని లేత ఆకులను కాడలను పచ్చడి చేసుకుని తినవచ్చు. నల్లేరు కాడలను చిన్న ముక్కలుగా తరిగి ఊతప్పం వంటి వంటలలో  వేస్తారు. నల్లేరు ను  దంచి గుజ్జును మినప అప్పడాల తయారీ లో వాడతారుఇది ఎముకలు బలపడటానికి for improving cartilage, ఉపయోగ పడుతుంది. దీన్ని వజ్రవల్లి అని కూడా అంటారుఇది అద్భుత ఔషధము. ఎముక విరిగి నప్పుడు చాలా ఉపయోగము  
Cissus quadrangularis నల్లేరు 
చేమ ఆకులు :
Botanical name:Colacasia esculenta ; Tender leaves cooked with dal, or with tamarind; It is useful in piles. The leaves controls bleeding from nose; 
Caution: కాలువ గట్ల మీద పెరిగే వి తినరాదు ;ఆకులు దురద పెట్టకుండా లేత వాటిని ఉడికించి తినాలి.  Better pot a few tubers in your homes.
Colacasia esculenta చేమ ఆకులు 
గుంటగలగరాకు: 
Guntagalagaraaku:Botanical name:  Eclipta alba Hassk /Eclipta prostrata L.Family: Asteraceae
It is used in jaundice.It can be cooked like chutney with Amla when suffering from jaundice. 
Eclipta alba. 
వామింట:Vaaminta: Family: Cleomaceae
Botanical name: Cleome gynandra L. It is a rich source of nutrients, but not so tasty, hence it may be cooked with dal.ఆకలి పుట్టిస్తుంది , మూల వ్యాధి నివారణ కు ఉప యోగ పడుతుంది.కొంచెము వాసన కలిగి ఉంటుంది 
వామింటాకు cleome gynandra
సిలోన్ బచ్చలి; Ceylone bachali:
Botanical name: Talinum portulacifolium Forsk. These three are good for gastric ulcer patients. It can be cooked with dal. The leaves are succulent, and mucilagenous, not sour or bitter.చప్పగా రుచి లేకుండా ఉంటాయి . 
Talinium portulacifolium
Family: Malvaceae
 చిట్టింత కూర, చిట్టింటాకు; సిత్నాట కుర :  
:Botanical name: Melochia corchorifolia L. ;cooked fresh or dry, preserve, and can be cooked with dal, it controls loose motions.
Melochia corchorifolia చిట్టింతాకు 
కలాస కూర;నేల బీర: 
Botanical nameCorchorus aestuans ; It is useful in stomachache due to worms. It can be cooked with dal.
Corchorus aestuance కలాస కూర 
Family: Solanaceae
కామంచి ఆకు, కాచి కూర 
Botanical name: Solanum nigrum L.;
 The leaf is useful in urinary and liver problems. ఆకును వాడ్చి పచ్చడి గా, ఇతర ఆకులతో కలిపి పప్పుకూరగా వండుకుంటారు. The ripe fruits are dried and used in curries. పండ్లను ఉప్పు, వాము తో  కలిపిఎండబెట్టి వరుగు లాగ చేసి నిల్వ ఉంచుతారు . వీటిని నూనెలో వేయించి   తింటారు.  
Solanum nigrum ;కామంచి 
 ఎలుక చెవి కూర:
Botanical name: Merremia gangetica L.; Family: Convolvulaceae
 It can be cooked with dal. To control anaemia, cough and asthma it is used. If eaten in large quantities constipation may result in.
Merremia gangetica ఎలుక చెవి కూర 
 అటక మామిడి:పునర్నవ:
 Botanical name: Boerhavia diffusa ; Family: Nyctaginaceae
 It is used in urinary problems. ఆయుర్వేదం లో మూత్ర సంభందిత సమస్యలకు దీన్ని ఒక ఔషధం గా వాడతారు ; పప్పు తో కలిపి వండుకో వచ్చు . 
Boerhavia diffusa; అటక మామిడి 
విటమిన్ల కూర:
 Botanical name: Sauropus androgynus L.; Family: Phyllanthaceae
It is a rich source of vitamins. It can be cooked with dal or used in salads or with tamarind. But consumption in high quantities may be avoided.
విటమిన్ల కూర Sauropus androgynous
గరిక:
 Botanical nameCyanodon dactylon L.Family: Poaceae; ఇది వినాయకుణ్ణి పూజించడానికి వాడే గడ్డే; ఆయుర్వేదం లో దీనికి ఔషధ లక్షణాలు వున్నాయి . లేత ఆకులను పచ్చడి లాగ చేసుకుంటారు  Controls bleeding, and useful in skin diseases.Tender leaves can be cooked.
Cynodon dactylonగరిక 
 బొక్కెనాకు : 
Phyla nodiflora -Family: Verbenaceae 
not tasty, but for used in urinary problemsదీనికి రుచి ఉండదు.అజీర్తి, మూత్ర సంభంద వ్యాధులు గల వారికి చలవ కొరకు దీన్ని వండి పెడతారు. 
Phyla nodiflora బొక్కెనకు 
ఏనుగు పల్లేరు Pedalium murex   ఇది పిచ్చి మొక్కలాగా పెరుగుతుంది ; దీని ఆకులు మందంగా జిగురు గా ఉంటాయి .the leaves are eaten in small quantities వీటి ఆకులను ఆఫ్రికా లో, చైనా లో ఆకు కూరగా వండుకుంటారు. కాయలకు ముళ్ళు ఉంటాయి 
ఏనుగు పల్లేరు Pedalium murex
బొద్ది కూర : Botanical name: Rivea hypocrateriformis
బొద్ది కూర Rivea hypocrateriformis 
leaves are cooked with tamarind and eatenఇది తీగ. తెల్లటి పూవులతో ఉంటుంది. ఆకులను ఉడికించి పులుసు కూర లాగ వండుకుని తింటారు .
చందమామ కూర :
Botanical nameMarselia quadrifolia; It is Pteridophyte;నీటి మడుగుల వద్ద పెరుగుతుంది  It can be cooked with dal or as chutney.
Marselia quadrifolia చందమామ కూర 
 ఎదురు ఉత్తరేణి:
Botanical name: Stachytarpheta jamaisens Vahl . Can be cooked with dal
ఎదురు ఉత్తరేణి Stachytarpheta 
దీ న్ని తెలంగాణా రాష్ట్రం లో వాళ్ళు ఎక్కువ గా వాడుకుంటారు. ఆకు తో పచ్చ్చడి, పొడి, పప్పు తో కూర గా వండుకుంటారు.
బుడ్డ కాకర ;
Botanical name: Cardiospermum helicacabum. It contains minerals and proteins .It is diuretic, It may be cooked with dal.
Cardiospermum బుడ్డ కాకర 
నీటి గొబ్బి: 
Botanical name: Hygrophyla asiatica  ఇది నీటి గుంటల అంచుల్లో వరిపొలాల గట్ల పై పెరుగుతుంది , ముళ్ళు ఉంటాయి . వీటి లేత ఆకులను వండుకుంటారు.tender leaves cooked and eaten.

నీటి గొబ్బి Hygrophyla asiatica
Trichodesma zeylanicum (Burm.f.) R.Br.,Trichodesma indicum (L.) Lehm. దీన్ని గువ్వగుత్తి లేదా గుర్రంగుత్తి అంటారు. ఆకులపైన బిరుసుగా వున్న నూగు వుంటుంది. దీన్ని  మొన్న కూరల మార్కెట్ లో అమ్ముతుంటే చూసాను. చాలా ఆశ్ఛర్యమేసింది.  వీటి లో కొన్ని విషపూరిత ఆల్కలాయిడ్లు ఉంటాయి. వీటిని తక్కువగా నే తినాలి ; ఈ ఆకులను ఇతర ఆకులు లేదా కూరల తో  కలిపి వండుకుంటారు     
ఆకు కూరలు గా తినే చెట్ల ఆకులు:
చెన్నంగి ఆకు : దీని ఆకులను పచ్చడి చేసుకుంటారు. ఇది అడవిలో పెరిగే చిన్న చెట్టు , తెల్ల పూలు ఉంటాయి. Botanical name: Lagerstroemea parviflora ; Family: Lythraceae
Lagerstoemia parvifloraచెన్నంగి 

దేవదారు :
Botanical name: Erythroxylum monogynum Roxb. ఇది చిన్న చెట్టు లేదా పొద వలె అడవుల్లో పెరుగుతుంది It can be cooked with green gram. It is useful in indigestion, it is cooling. 
Erythroxylum; దేవదారు 
పులిచింతాకు:
ఈ పేరుతొ వున్న ఆకులను పరిచయం చేస్తాను. 
 ఇది నేల మీద పాకే చిన్న గుల్మము : Botanical name:  Oxalis corniculatum L. (Family: Oxalidaceae) It is used to control diarrhea ; it can be cooked as chutney or salad which is tasty.Useful in anemia and improves digestion.

 Oxalis corniculatum  పులిచింతాకు 
 Bauhinia malabarica ఇది పెద్ద చెట్టు, దీని ఆకులు కూడా పుల్లగా ఉంటాయి వీటిని కూడా పులిచింతాకు అంటారు, ఇవి గోదావరి జిల్లా అడవుల్లో ఉంటాయి. దీన్ని కూడా వండుకుంటారు.వీటి  ఆకులు మోదుగ ఆకుల్లాగా ఉంటాయి .  the leaves are sour to taste, eaten after cooked
చింత చిగురు, ఎండు  చింతాకు వాడకం అందరికి తెలిసినదే ఇవి కాక 
 అవిసె : Botanical name: Sesbania grandiflora; ఆకు ను పువ్వులను కూడా కూరగా పప్పుతో కలిపి వండుతారు.   It is cooked purely or with dal. It is eaten by ShriVaishnavas on Dwaadasi after Ekadasi fast. It dissolves urinary bladder stones, it is laxative; lactogouge. The leaves contain linolenic acid and Aspartc acid responsible for antiglycation.
Sesbania; అవిసె 
జొన్న పళ్ళు / పులసరి Antidesma ghasembilla వీటి పళ్ళను తింటారు;ఆకులను కూడా  వండుకుంటారు  ఆకులు పుల్లగా ఉంటాయి.  
బ్రహ్మ ఆమ్లిక
Brahma aamlika, :Botanical name  Adansonia digitata L.Family: Malvaceae  The leaves and pulp of the fruit are edible. They are cooked in Rajasthan. It is cooked through out Africa.I have tried fruit pulp it is tasty like tamarind

Adansonia
మునగాకు
Botanical name: Moringa oleifera Lam; పచ్చి ఆకులను ఉడికించి కూరగా లేదా పప్పుతో కలిపి లేదా పచ్చడి పొడి లాగ వండుకో వచ్చు leaves and fruit are used as edible. మునగ ఆకును నీడలో ఎండ బెట్టి పొడి చేసి కొన్ని వంటల్లో కలుపు కో వచ్చు . 
It contains Iron 5 times higher, 15 times higher in Calcium;Vitamin A 60 times higher, vitamin C 2 times higher than other leafy vegetables.it inhibits absorption of phyto iron.  
మునగ ;Moringa oliefera
బలుసు ఆకు ;
 Botanical name: Canthium dicoccum ;ఇదిముళ్ళ పొద; ఆకులు మందంగా ఉంటాయి   cooked as vegetable.it is cooling. Kills worms in the stomach, 
బ్రతికుంటే బలుసాకు తిన వచ్చునన్న సామెత వుంది.

Canthium
సముద్ర తీర ప్రాంతాల్లో వారు వాడుకునేవి  ఇల కూర; ఉప్పు ఆకు:
Botanical name: Suaeda maritima   
Suaeda; ఉప్పు ఆకు 
Salicornia and suaeda are available near salty marshes in the sea coast, they accumulate salt; they are cooked with fish and crabs with out adding additional salt.They are cooling.

కరివేపాకు గాక , సువాసనకు, రుచి, ఆరోగ్యానికి కొన్ని నిమ్మ జాతి మొక్కల ఆకులను కూరల్లో కలుపు తారు.నిమ్మ , దబ్బ , నారింజ ఆకులను చారు , మజ్జిగ లో సువాసనకు వాడుకోవడం తెలిసినదే ; ఇవి కాక మరి కొన్ని
కొండ కసిమింద
Zanthoxylum armatum ; the leaves are used like curry leaves for flavour.ఇది 3-7 దళాలు కల ముళ్ళతో వున్న ఆకు . వీటిని కూడా వంటల్లో సువాసన కొరకు వేసుకుంటారు . ఇవి కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది; వీటి పండ్లను బెంగాల్ లో మిరియాల్లాగా వంటల్లో వాడుకుంటారు
Zanxthoxylum armatum
కొండకసింత Toddalia asiatica  
దీని ఆకులను కూడా సువాసనకు వాడుకుంటారు    
  గొంజి/గొలుగు:
 దీని Botanical name: Glycosmis pentaphylla : cooked with rice and zinger.దీని ఆకులను బాలింతలకు ఆకలి పుట్టించడానికి , జీర్ణ సంబంధ వ్యాధులున్న వారికి వండి పెడతారు. అల్లం తో కలిపి అన్నంతో వండుతారు. ఇది కొంచెం నిమ్మ ఆకు లాగే వాసన తో ఉంటుంది. దీని పళ్ళు యెర్ర గా ఉంటాయి . తియ్యగా ఉంటాయి. 
Glycosmis pentaphyllaగొంజి 
 శీకాయ.Senegalia rugata (Lam.) Britton & Rose, , leaves cookedలేత శీకాయ ఆకుతో పచ్చడి చేస్తారు,
 Caralluma attenuata: the tender stems are cooked as chutney. in small quantities.కుందేటి కొమ్ములు : వీటికి ఆకులు వుండవు, ఆకు పచ్చటి కాడలను నల్లేరు లాగా పచ్చడి చేసుకుని తిన వచ్చును . ఇది కాకర లాగ చేదు గా ఉంటుంది. జీర్ణ కోశ వ్యాధులకు , మధుమేహ నియంత్రణకు కొన్ని గిరిజన జాతుల వాళ్ళు తింటారు. ప్రతిరోజూ కాకుండా వారానికి ఒక సారి మాత్రమే పరిమితం గా తినాలి. 
కుందేటి కొమ్ములు 
Leafy vegetables as Laxatives: మలబద్దకం వున్న వారికి సుఖ విరోచనం అయ్యేందుకు వాడుకునే కొన్ని ఆకులు . వీటిని పచ్చడి లాగా చేసుకొని లేదా పొడిని నీళ్లలో కలిపి లేదా కషాయంగా వాడుకుంటారు ఇవి చేదు గా ఉంటాయి These leaves are cooked as chutnies to relieve constipation. Hence only small quantities should be taken to clean our digestive system. అవి తూటి కూర,సునా ముఖి,నేలతంగేడు,ఉత్తరేణి; 
తూటి కూర: Thutikura:Botanical name: Ipomaea aquatica L.; నీటి గుంటల్లో బురద లో పెరుగుతుంది . Can be cooked with dal. Antidote for Arsenic poison and opium poison.Serves as laxative.
Ipomea aquatica ; తుటి కూర 
సునా ముఖి:
Senna, Sunaamukhi:;Botanical name:  Cassia angustifoliaVahl. / Senna alexandria gar.ex. Miller. The leaves and pods are dried and used as powder or cooked as chutney.The dried plants are exported to USA and Europe. It occupies first place in the export of medicinal herbs from India.
Cassia angustifolia సునాముఖి 
నేలతంగేడు: Nelatangedu: Botanical name: Cassia italica(Mill.)Spreng. The leaves and pods are dried and used as powder or cooked as chutney.
Cassia italica నేల తంగేడు 
 ఇవి ఆకు కూరలలో కలిస్తే తీసి పడవేయ కండి ఇవి ఏవి విషం కావు. పైగా ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఆకు కూరలను తాజావి , పరి శుభ్ర మైనవి, తీసుకోండి. రోజు ఒకే ఆకు కూరను తినవద్దు. oxalates ఎక్కువగా వున్నఆకు కూరలను ఉడికించి ఆ నీటిని పడవేయండి.ఆకు కూరలను పప్పు తో కలిపి వండితే వాటి లోని పోషకాలు  బాగా అందుతాయి. మునగాకు లోని కొన్ని పదార్దాలు ఇనుమును శరీరానికి అందకుండా అడ్డుకుంటాయి. కాబట్టి రక్త హీనత వున్న వారు ఇటువంటి ఆకులకు దూరంగా వుంటే మంచిది. అయితే కాల్షియం బాగా ఇస్తాయి. చింత పండును ఆకు కూరలతో వాడితే విటమిన్లు ఖనిజాలు నశించ కుండా కాపాడుతుంది. సాంప్ర దాయేతర ఆకు కూరలను ఎక్కువగా వాడ కండి. మందు లాగా అప్పు డప్పుడు వాడు కో వచ్చును. వండే   విధానం కుడా తెలుసు కొని వుండాలి.    
Besides these leaves; even the phylloclades of opuntia; buds of Cereus are cooked. of some cactus are also eaten. కొన్ని రకాల నాగ జెముడు మట్టలను కూడా తింటారు. All these require the proper method of cooking.

సాంప్రదాయేతర కూరగాయలు: కూరలు అనగానే గుర్తుకు వచ్చేవి వంకాయ, బెండకాయ, దోస,పొట్ల, సొర /ఆనప కాయ, బీర, దొండ, కాకర, చిక్కుడు,గోరు చిక్కుడు,  మునగ, టమాటో, మిరప, అరటి,కాబేజీ, కాలిఫ్లవర్ ప్రధానమయినవి; ఉల్లి, బంగాళా దుంపలు, కంద, చేమ, ముల్లంగి, కారట్, బీట్రూట్, వంటి దుంపలు; మామిడి, ఉసిరి, చింత, నిమ్మ పులుపు కొరకు,అల్లం , పచ్చి మిరప అందరూ వాడేవి. ఇవి కాక కొన్ని కాయలను పరిచయం చేస్తాను;        , 
1.అరటి పువ్వు, అరటి దూట ; (ఎర్రటి దొప్పలను తొలగించి లోపలున్న పువ్వులను తినాలి ) వీటిని కొందరు మాత్రమే వండుకుంటారు, ఇవి రక్తంలో వున్నా కొవ్వు కరిగించ డానికి, కడుపులో పూత ఉపశమనానికి వాడుకో వచ్చు . 
2. అత్తి/మేడి  కాయలు : పండనివి, ముదురు అత్తి కాయలతో కూర చేసు కుంటారు , ఇది మధు మేహులకు ఉపయోగం.
 3. వాక లేదా కలే కాయలు : వీటితో పచ్చడి , పప్పు చేసుకుంటారు , ఇవి పుల్ల గా ఉంటాయి . 4.పనస కాయల కూర అందరికి తెలిసినదే, అదే జాతికి చెందిన నక్కరేగు(Artocarpus lacoocha) కాయలను తింటారు.
 5. నక్క దోస అనే చేదు గా వుండే చిన్న దోస కాయలను వరుగు లాగ చేసుకుని తింటారు. ఇవి పొలాల్లో కలుపు లాగ పెరుగుతాయి . 
6. నేతి బీర కాయలు కొందరు తినరు , ఇవి కూడా తినవచ్చు , చప్పగా ఉంటాయి.
 7.కాకర, ఆగాకార కాయలు అందరికి తెలిసినవే ; కాసర కాయలు:ఇవి కాకర జాతికి చెందినవి, చిరు చేదు గా ఉంటాయి, కూర చేసుకుని తింటారు.వీటిని రాయల సీమలోని కొన్ని జిల్లాల్లో కొన్ని ఋతువుల్లో తింటారు . మధుమేహులకు బాగా ఉపయోగము . 
8. తంబ కాయలు : ఇవి చిక్కుడు జాతికి చెందినది , కాయలు వెడల్పు గా ఉంటాయి, కొంచెం పసరు వాసనతో ఉంటాయి , తినవచ్చు .
10. వెలగ : వెలగ కాయ గుజ్జు తో పచ్చడి, పప్పులో వాడుకోవచ్చు. బాగా పండినవి తినొచ్చు.    
11. కొండ మామిడి(Spondias pinnata) కాయలను ఊరగాయగా పచ్చడి గ చేసుకుంటారు. 12. రేవడి లేదా కళింగ చెట్టు కాయలు కొంచెం పుల్లగా ఉంటాయి వీటిని కూడా కూరల్లో తింటారు. 
13. Adansonia digitata  baobab అనే చెట్టు కు పెద్ద కాయలు కాస్తాయి , వాటిలో పీచు గుజ్జు విత్తనాలుంటాయి , గుజ్జు చింతపండు లాగ పుల్లగా ఉంటుంది, చింత పండు లాగ వాడు కో వచ్చు. 
14. ఉస్థి కాయలను వరుగు లాగ చేసుకుని తింటారు.   
ఇంకా వుంది 
15. లేత వెదురు చిగురు కాండాలను కూరలాగా వండుకుంటారు.
16. దుక్క పెండలం , కర్ర పెండలం కూడా వండుకుంటారు. 
17. తామర విత్తనాలు, తామర దుంపలు, నమ్మ (Aponogeton sps)దుంపలు కూడా వండుకో వచ్చు . 
తినే పుష్పాలు :  
Edible flowers: We know flowers for worship or for decorations or used as medicines. I wanted to introduce such edible flowers
1. Banana flowers:అరటి పూలు  Musa sapientum, M.acuminata, M.balbisiana, etc are edible.
the flowers are cooked as vegetable with dal, coconut etc.
2. Flowers of Senna occidentalis, Cassia occidentalis తంగేడు పూలు ; Cassia fistula రెల్ల పూలు are cooked with dal as vegetable.
3. Moringa /drumstic flowers: మునగ పూలు they are cooked like vegetable with dal.
4. Tamarind flowers:చింత పూలు like tender leaves, young fruits, tamarind flowers are cooked as vegetable, and to make chutneys etc.
5. Sesbania grandiflora : అవిసె పూలు like the leaves the flowers are cooked.     6. Rose petals: గులాబీరేకులు rose petals are widely used in sharbats, sweets, and gulkhand.
7. Margosa/neem flowers: వేపపూలు neem flowers are used in ఉగాది పచ్చడి Ugadipachadi, the fallen flowers are collected and dried, the dry flowers are used to make chutney or cooked with tamarind to make a side dish.
8.Clitoria ternata: Shanku pushpaalu శంకుపుష్పాలు the blue coloured flowers are used to make tea; it is refreshing.
9. Bombax ceiba : red cotton tree or కొండబూరుగ ; the flower buds are cooked as vegetable.
10. Oroxylum indicum:Indian trumpet flower; డుండిలము    the flower buds are cooked as vegetable. 
11. Cucurbita maxima, Cucurbita pepo: Pumpkin తియ్య/పెద్ద  గుమ్మడి పూలను cooked as vegetable with basin, coconut etc. 
12. Hibiscus sabdarifa గోంగూర పూలు the flower buds are cooked like chutney.
     Our wild fruits : regu (Zyziphus jujuba,Z.nummularis); neredu (Syzyzium cumini, S.alternifolium) vaaka, kale kaayalu (Carissa carandus, C.spinarum),pemu pandlu (Calamus rotang) vooti pandlu (Diospyros ferrea), pariki (zyziphus oenoplea),eetha (Phoenix sylvestris) Jana (Grewia asiatica),Nakka regy (Flacourtia indica), to be continued  
మన కూరగాయలు : మన తెలుగు వాళ్ళు సాధారణం గా వాడే కూరగాయలు:
దోస జాతి కూరలు: 1. బూడిద గుమ్మడి: Benincas hispida : దీన్ని కూరగా, సాంబారులో, వడియాలుగా, తీపి పదార్ధాల తయారీ కి వాడుకుంటారు. ఇది కడుపులో అల్సర్లు కలవాళ్ళకు మంచిది. 
 2. తీపి గుమ్మడి లేదా పెద్ద గుమ్మడి: Cucurbita maxima;పొట్టిగుమ్మడి Cucurbita pepo: ఎర్ర గుమ్మడి:Cucurbita maxima: వీటిని కూరగా, సాంబారులో, తీపి పదార్ధాల తయారీ కి వాడుకుంటారు. దీనిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది.తీయగా రుచిగా ఉంటాయి. 
3. పొట్లకాయ Trichosanthes anguina : వీటిలో పొడవు పొట్టి రకాలున్నాయి . కూరగా ప్రసిద్ధి. 
4. దోస కాయ : Cucumis melo L.var. utilissimus, : వీటిలో వివిధ రకాలున్నాయి . కూరగా ప్రసిద్ధి.
5.సొర/ఆనప కాయ:Lagenaria siceraria:వీటిలో వివిధ రకాలున్నాయి . కూరగా ప్రసిద్ధి.
6. బీర కాయలు : Luffa acutangula: కూరగా ప్రసిద్ధి.
7. కీర కాయలు Cucumis sativa
8. దొండకాయలు : Coccinia grandis 
9. కాకర కాయలు : Momordica charantia 
10. ఆగాకార : Momordica dioica
11. సీమ వంకాయ, చౌచౌ:  Sicyos edulis  
12.టిండా: Praecitrullus fistulosus :  ; ఈ కాయలు ఉత్తర భారత దేశము లో దొరుకుతాయి; అపుడపుడు మన supermarkets లో కూడా దొరుకుతాయి 
13. పర్వల్ : Trichosanthes dioica 

చిక్కుడు జాతి కూరలు:
1. పందిరి చిక్కుడు : Lablab purpureus subsp. bengalensis ;
Lablab purpureus subsp. purpureus
2. గోరుచిక్కుడు,or మొటిక్కాయలు: Cyamopsis tetragonoloba
3. French beans/బీన్సు కాయలు : Vicia faba; Phaseolus vulgaris
4. అలసంద కాయలు: Vigna unguiculata
5. బఠాణి : Pisum sativum
ఇతర రకాలు 
మిరప కాయలు : Capsicum annuum
కూర మిరప, bell pepper: Capsicum annum L. var. grossum
టమోటా :Lycopersicon esculentum
వంకాయలు: Solanum melongena L. var. Melongena
జీడిమామిడి,ముంతమామిడి: Anacardium occidentale
మామిడి: Mangifera indica
బెండ కాయ: Abelmoschus esculentus
మునక్కాయలుMoringa oleifera
క్యాబేజి: Brassica oleracea L. var. capitata
కాలీఫ్లవర్: Brassica oleracea var. botrytis
నూల్కోల్: Brassica oleracea L. var. gongylodes 
అరటి: Musa paradisiaca, Musa balbisiana
గోంగూర: Hibiscus cannabinus
ఎర్రగోంగూరHibiscus sabdariffa 
ఉసిరి/ ఉసిరిక: Phyllanthus emblica
రాచ ఉసిరిక: Phyllanthus acidus
దుంపకూరలు 
ముల్లంగి : Raphanus sativus
బంగాళాదుంపలు : Solanum tuberosum
బీట్రూట్:  Beeta vulagaris
క్యారెట్: Dacus carota
కందగడ్డమంచికంద:Amorphophallus paeoniifolius
చామగడ్డ:Colocasia esculenta
దుక్కపెండలం: Dioscorea alata
పెండలం: Dioscorea bulbifera,Dioscorea esculenta, Dioscorea cayennensis var. rotundata
Casava/ఆళ్వారి గడ్డలు : Manihot esculenta
చిలగడ దుంప/గెణుసు గడ్డలు : Ipomoea batatas 
Arrowroot: Maranta arundinacea
ఉల్లి పాయలు: Allium cepa
వెల్లుల్లిపాయలు: Allium sativum
అల్లము: Zingiber officinale
మామిడల్లం: Curcuma amada
నిమ్మజాతి ఫలాలు  
నిమ్మ: Citrus aurantiifolia 
నారింజ, కిచిలీ:Citrus aurantium
దబ్బ కాయ: Citrus limon
పంపరపనస: Citrus maxima 
      
contd......... 
          


  

7 comments:

  1. Good efforts. All the best for future posts. I have bookmarked you. Well done. I

    read and like this post. Thanks.
    IT Company India

    ReplyDelete
  2. Living at Nellore the ricebowl of Madras presidency Lalithmba could write on few edible plants easily understood by all.With more data avilable on native species we will add more plants of Coromandel Coast,Eastern Ghats and Deccan plataeu to make this article invaluable-D.C.S.Raju retd Head of National Herbarium,Jt Director,Bot.Surv.India

    ReplyDelete
  3. very gud information , thank u ;
    & సోది చెప్పే వాళ్ళు - పచ్చబొట్టు బొమ్మలు వేస్తుంటారు. పచ్చ రంగు కి వచ్చే ఆ పసరును - ఏ చెట్టు ఆకులతో చేస్తారు? - ఆ అడవి మొక్క పేరు - ఏటి? తప్పకుండా చెప్పగలరని ఆశిస్తున్నాను.
    =
    sOdi ceppE wALLu - paccaboTTu bommalu wEstumTaaru. pacca ramgu ki waccE A pasarunu - E ceTTu AkulatO cEstAru? - aa aDawi mokka pEru - ETi? tappakumDA ceppagalarani ASistunnaanu.

    ReplyDelete

Millets, Pulses, Oilseeds, Spices-చిరు ధాన్యాలు , పప్పు దినుసులు , నూనెగింజలు, సుగంధ ద్రవ్యాలు

మనం తినే ఆహారం లో పిండి పదార్థాలు , మాంసకృతులు , కొవ్వులు ఎక్కువ పాళ్ళలో కావాలి . వీటితో పాటు అనేక పోషకాలు తక్కువ పాళ్ళలో కావాలి. తెల్లబియ...