Tuesday, March 28, 2017

Millets, Pulses, Oilseeds, Spices-చిరు ధాన్యాలు , పప్పు దినుసులు , నూనెగింజలు, సుగంధ ద్రవ్యాలు

మనం తినే ఆహారం లో పిండి పదార్థాలు , మాంసకృతులు , కొవ్వులు ఎక్కువ పాళ్ళలో కావాలి . వీటితో పాటు అనేక పోషకాలు తక్కువ పాళ్ళలో కావాలి. తెల్లబియ్యం లో , రిఫైన్డ్ నూనెల్లో, ఈ అవసరమైన సూక్ష్మ పోషకాలు అస్సలు వుండవు. అందుకే మన ఆహార పదార్థాల గురించి తెలియ జేసే ప్రయత్నం. ఈ చిరు ధాన్యాలు కూడా వరి  లాగే గడ్డి జాతి మొక్కలు. శాస్త్రీయంగా Poaceae కుటుంబానికి చెందిన గుల్మాలు . ఈ చిరు  ధాన్యాల్లో పీచు అధికంగా ఉండడం, వలన జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, తక్కువ తిన్నా కడుపు లో చాలా సేపు నిండుగా ఉంటాయి, రక్తంలో వున్నా చెడు కొవ్వును కరిగించడం లో తోడ్పడుతుంది.అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉండడం ఫలితంగా శరీర ధర్మ క్రియలలో అసమ తుల్యతలను తగ్గించి వ్యాధి నిరోధకత పెరగడానికి తోడ్పడతాయి. అందువల్ల అధిక రక్తపోటు, మధుమేహము, కాన్సరు వంటి జబ్బులను కొంతవరకు తగ్గించు కో వచ్చు. అధిక బరువు నియంత్రణ కు తోడ్పడుతుంది.         
1. Our millets  మన చిరు ధాన్యాలు:       
Our ancestors used to consume millets.  But due to green revolution our dietary habits were changed drastically. White rice occupied the prime place due to easy and cheap availability, besides ease of cooking. Many of us may not be aware of a variety of millets that were used in our diet. Their consumption provides health benefits. They are rich source of micro-nutrients that are essential in very small quantities. They are fiber rich, the fiber dissolves bad cholesterol, thus prevents many metabolic disorders.prevents breast cancer and heart disease.helps to optimize kidney and boosts immune system. helps in maintaining healthy gastric microbes.  They help in controlling diabetes. The immunity will also be enhanced. In dry areas, without much water, and harmful pesticides they can be cultivated. Because of increasing awareness the cost of the millets is more than that of rice. White rice contains only carbohydrates. The glycemic index of millets is also lower than that of rice. They are anti-acidic, mostly gluetin free. detoxify the body. Hence their consumption is essential for good health.  In view of the benefits I try to introduce the millets and few easily made recipes. సాధారణంగా వీటిని సాగు చేసేప్పుడు హాని కారక పురుగు మందులువాడరు. మెట్టప్రాంతాల్లో సాగు చేయ బడతాయి. వీటి వాడకం వలన రైతుకు మనకూఉపయోగమే.       
Major millets: great millet, pearl millet, finger millet and foxtail millet. remaining are less known, known as minor millets.   
1. జొన్నలు : jonnalu- Great Millet: Botanical name: Sorghum bicolour (L.) Moench, 
జొన్నలు Great Millet
జొన్నల్లో niacin, riboflavin, and thiamin,అనేB- విటమిన్ భాగాలు, అధిక మోతాదుల్లో magnesium, iron, copper, calcium, phosphorous, and potassium, అనే ఖనిజములు , మాంసకృతులు ; పీచు పదార్దములు వున్నాయి. పీచు జీర్ణ వ్యవస్థ ను ఆరోగ్యంగాఉంచడమే కాకుండా రక్తములో వుండే చెడుLDL  కొలెస్టిరాల్ను తగ్గించడములో తోడ్పడుతుంది. దీన్లో వుండే మెగ్నీషియం కాల్షియం గ్రహించడానికి ఎముకల పుష్టికి ఉపయోగ పడుతుంది. దీన్లోని కొన్ని ఆంటీ-ఆక్సిడెంట్లు కాన్సరు నిరోధకాలుగా వాపులను నిరోధించ డం లో తోడ్పడతాయి. గ్లూటెన్ ఉండదు. వీటిని తిన్నపుడు కొద్దిమందికి మాత్రమే అలర్జీలు కనిపించ వచ్చు. వీటిని ఉడికించి (ఆవిరిలో లేదా నేరుగా) వేడినీటితో పిండిని తడిపినపుడు అన్ని పోషకాలు శరీరానికి బాగా అందుతాయి.                    
2.రాగులు/ చోళ్ళు /తమిదలు: raagulu- finger millet :Botanical name: Eleusine coracana (L.) Gaertn
good laxative and prevents constipation. People who suffer from liver diseases, high-blood pressure, heart weaknesses and asthma should consume roasted  finger millet. It is a rich source of Essential Amino acids, such as  Valine, Methionine, Isoleucine, Threonine and Tryptophan. ఈ అమినోఆమ్లాలు శాఖాహారుల ప్రధాన ఆహారం లో తగినంత దొరకవు. దీనిలో కాల్షియం , ఇనుము ధాతువులు అధిక మోతాదులో దొరుకుతాయి. జొన్నల్లో వలె దీనిలో కూడామాంసకృతులు ; పీచు పదార్దములు సమృద్ధిగా వున్నాయి.  కావున రాగులను ప్రతి రోజు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది . రాగులు చలవ చేస్తాయి. రాగుల్లో 3.9 mg ఇనుము, 344 mg కాల్షియంఉండడం వల్ల ఎముక పుష్టికి రాగులు మంచివి.        
3. సజ్జలు :Sajjalu-Pearl millet:Botanical name: Pennisetum glaucum (L.) R. Br.
సజ్జలుPearl millet
సజ్జల్లో కూడా పీచు, మాంసకృత్తులు, ఖనిజములు పుష్కలంగా వుంటాయి. దీనిలో ప్రధానంగా phytic acid and niacin ఉండడం వల్ల చెడుకొలెస్టిరాల్ను తగ్గిస్తుంది. పైల్స్, మలబద్దకం వున్నవాళ్ళు సజ్జలతో చేసిన పదార్థాలు తినడం చాలా మంచిది. మిగిలిన చిరు ధాన్యాల్లాగే దీనిలో కూడా గ్లూటెన్ ఉండదు . రుచిగా ఉంటాయి. తొందరగా ఆకలి కాదు. దీనిలో ఇనుము 16.9 mg, 38 mgకాల్షియం ఉండడం వల్ల రక్తహీనత వున్నవారికి మంచిది.        
4. కొర్రలు: korralu-Foxtail millet:Botanical name: Setaria italica L.,
కొర్రల్లో కూడా Lysine, Thiamin అనే అమినోఆమ్లాలు , ఇనుము ,10% ప్రోటీను, పీచు అధికంగా ఉంటాయి.   
5.ఆరికలు: aarikalu-Kodo millet : Botanical name: Paspalum scrobiculatum L. Var. scorbiculatum, 
ఆరికల్లోప్రోటీన్ 9% వరకుంటుంది. ఇనుము , పీచు, కాల్షియం మిగిలిన చిరు ధాన్యాలకన్నా తక్కువ అయినా దానిప్రోటీన్ అమినోఆమ్లాలు విలువైనవి.  The grain is recommended as a substitute for rice to patients suffering from diabetes disease. is very easy to digest, it contains a high amount of lecithin and is excellent for strengthening the nervous system.      
6. సామలు: saamalu-Little millet:Botanical name: Panicum sumatrense L., 
దీనిలో ఇనుము 9 mg, పీచు అధిక ముగా ఉంటాయి . The little millet contains 8.7 gram protein, 75.7 gram carbohydrate, 5.3 gram fat and 1.7 gram mineral in per 100 gram.It is wonderful millet which is suitable for people of all age groups. It helps to prevent constipation & heals all the problems related to stomach.Its high fiber helps to reduce the fat depositions in the body.
7. వరిగలు varigalu-Proso millet :Botanical name: Panicum miliaceum L., 
వీటిలో ప్రోటీను, పీచు అధికముగా ఉంటాయి.The seeds may be creamy white, yellow, red or black.  
few millets కొన్ని చిరు ధాన్యాలు 
8.మొక్క జొన్న  mokka jonna- corn:Botanical name: Zea mays L., 
మొక్క జొన్న Corn 
మొక్కజొన్న ల్లో : magnesium,127 mg phosphorus210 mg potassium287 mg, selenium 15mg, B1, B2, B3, B5, B6, B9,in high quantity, Leutin, zeaxanthin అనేవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. Fibre 7.3gms ఎక్కువగా ఉంటుంది. శుద్ధి చేసిన corn flour లో పిండి పదార్ధము మాత్రమే ఉంటుంది. గింజలను ఉడికించి, కంకులను కాల్చి లేదా రవ్వ లాగ తింటే అన్ని పోషకాలు అందుతాయి. ఇవి గుండె, ఎముకల ఆరోగ్యం చక్కగా ఉండడానికి ఉపయోగ పడతాయి. Baby corn are very young corns, Sweet corn:Zea mays saccharata, Pop corn:Zea mays everta,      
9. ఊదర్లుoodarlu- Indian barn yard millet: Botanical name: Echinochloa frumentacea L.
It is a fair source of protein, which is highly digestible and is an excellent source of dietary fibre with good amounts of soluble and insoluble fractions..   The carbohydrate content is low and slowly digestible  which makes the Barnyard millet a natural designer food. 
దీనిలో ఇనుము 15mg, పీచు, ఇతర ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి.    
10.  కోడి సామలు:Kodisama- hippo grass, Burgu millet,Botanical name:  Echinochloa stagnina 
11. అండు కొర్రలు Brown top millet(Eng.), Brachiaria ramosa (L.)Stapf.,
Eaten as millet.seeds mixed with bajra (millet) to increase bulk; or mixed with other grains. It is noted that chapattis prepared from its flour should be consumed with buttemilk, otherwise it causes acute constipation.used to make porridge, or unleavened bread. Used in Rajastan and Orissa. It is a famine food.
11.యెర్ర బియ్యం: yerra biyyam- red rice or wild rice: Botanical name:Oryza  rufipogon
దీన్లో  ప్రోటీన్లు , పీచు అధికంగా ఉంటాయి; లైసిన్ అనే ఎమినో ఆమ్లము ఉంటుంది. thiamin, riboflavin,of niacin, b6, folate, magnesium, phosphorus, potassium, ఇనుము, తెల్ల బియ్యం లో కన్నా ఎక్కువగా లభిస్తాయి.   
12. బార్లీ :Barley: Botanical name: Hordeum vulgare L.,
బార్లీ, ఎర్రబియ్యం   
బార్లీ , యెర్ర బియ్యం చిరు ధాన్యాలు కావు, కానీ మన దేశం లో ప్రధాన ధాన్యాలు కాదు కాబట్టి వీటిని ఇక్కడ చేర్చడం జరిగింది.
 బార్లీ లో iron, phosphorous, calcium, magnesium, manganese, and zinc, పుష్కలం గా ఉంటాయి . అందువల్ల ఎముక పుష్టికి ఉపయోగ పడతాయి 
potassium, folate, and vitamin B6 గుండె కు మంచివి. పీచు అధికముగా ఉంటుంది . దీనిలోని Selenium  కాన్సరు కారక పదార్థాలను detoxify చేస్తుంది. దీనిలో ప్రోటీను కూడా ఎక్కువ గా ఉంటుంది. బార్లీ జావ జ్వరం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఆహారం లో భాగం గా చేసు కుంటే మధుమేహం, B.P.  తగ్గించు కో వచ్చు. బార్లీ గింజలను ఉడికించి సలాడ్లలో కలుపుకో వచ్చు . బార్లీ పిండిని దోసెలు , చపాతీల పిండి లో కలుపు కో వచ్చు . రవ్వ తో జావ కాచి తాగ వచ్చు.       
 ఈ 12 రకాల చిరు ధాన్యాలను మన ఆహారము లో చేర్చు కోండి. ఆరోగ్యాన్ని పొందండి . 
చాలా ready to eat foods like noodles, biscuits, etc., ల్లో ఈ చిరు ధాన్యాల పిండిని గోధుమ పిండి తో కలుపుతారు.ఈ ready to eat foods లో ఉప్పు,చక్కెర,కొవ్వు,  నిల్వకు వాడే రసాయనాలు హాని కారకాలు .  బార్లీ లో తప్ప మిగిలిన వాటిలో గ్లూటిన్ ఉండదు. వీటి పిండి తో దోసెలు, చపాతీలు చేసుకో వచ్చు . వీటి పిండిని జావలాగ చేసుకుని తాగ వచ్చు . కొర్రలు, ఆరికలు, సామలు తో నేరుగా గోధుమ రవ్వతో వలె ఉప్మా, పొంగలి చేసుకో వచ్చు.వీటి రవ్వతో ఇడ్లి చేసుకో వచ్చు .  వీటి తో జంతికలు, అరిసెలు వంటి పిండి వంటలు చేసుకో వచ్చు. వంట అనేది మన creativity కి సంబందించినది. నియమాలుండవు. మన జిహ్వ కోరికల మేరకు బియ్యపు పిండి బదులు కొర్ర, సామ, వరిగ , ఆరిక పిండివాడు కో వచ్చు. రాగి పిండి తో అంబలి , సంగటి కాక ఇతర వంటలు చేసుకో వచ్చు. వీటిని శుభ్రము చేసుకోవడం కొద్దిగా కష్టము గా ఉండవచ్చు .  
2. Pulses /పప్పు దినుసులు : వీటిని lentils అనికూడా అంటారు. మనం సాధారణం గా వాడేవి Pigeon pea/ red gram;కంది పప్పు-Cajanus cajan (L.) Millsp.,
దీనిలో ప్రోటీన్ 21.7%,methionine, lysine, tryptophan అనే అమైనోఆమ్లాలలు , 130mg కాల్షియం ఉంటాయి. మంచి పోషకము.      
కంది పప్పు లో కేసరి పప్పు  కలుపు తారు. కేసరి పప్పు కంది పప్పు వలె వున్నప్పటికీ అవి నలుచదరంగా , గతుకులతో పలుచగా ఉంటాయి
Garbanzo Beans/ Chickpea/ Bengal gram పప్పు శనగ-Cicer arietinum L., వీటిలో ఎర్రవి/black /green -వీటిని దేశీ రకమని అంటారు. ఇవి చిన్నవిగా గరుకు గా ఉంటాయి. తెల్లగా,పెద్దగా,నునుపుగా వుండే వాటిని కాబూలీ రకమని అంటారు. పోషకాలు రెండింటిలో దాదాపుగా సమానమే. ప్రోటీన్ 20%, folate, ఖనిజలవణాలు, సమృద్ధ్ధిగా వుండి, సులభంగా జీర్ణమవుతాయి. తొక్క తీయని శనగలు మొలకెత్తించి , లేదా నానబెట్టి తినడం వలన రక్తంలో cholesterol శాతాన్ని తగ్గించడం లో తోడ్పడతాయి. పప్పును, పిండిని సమృద్ధిగా వాడుకోవచ్చు . తీపి వంటకాల తయారీలో పిండిని విరివిగా వాడతారు.         
Black Gram/ Black Lentil మినుము-Vigna mungo(L.)Hepper:దీనిలో 25%protein, calcium 138mg, ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి.రక్తంలో cholesterol శాతాన్ని తగ్గించడం లో తోడ్పడుతుంది. దీన్ని పేదవారి/శాఖాహారుల మాంసం అంటారు. నీటిలో నానినప్పుడు జిగురు గా తయారవుతుంది. దక్షిణాది భారతీయుల కు ఇది ప్రోటీనులను అందించే పప్పు. సులభంగా జీర్ణ మవుతుంది.       
Green Gram/ Lentil పెసర-Vigna radiata (L.)Wilczek. :దీనిలో 23% protein , calcium 130mg, ముఖ్యమైన ఎమినోఆమ్లాలు ఉంటాయి. 4 గంటల్లో వీటిని మొలకెత్తించ వచ్చు . మొలకలు రుచిగా , సులభంగా జీర్ణమయ్యే విధంగా ఉంటాయి. 
అందువల్లే పై  4 రకాల పప్పులను వేల సంవత్సరాలుగా తింటున్నారు.       
 ఇవికాక Sweet peasబఠాణీ- Pisum sativum ( తెల్లవి, ఆకుపచ్చవి ),పచ్చివి ఉడికించి వివిధ కూరల్లో వాడతారు. ఎండిన వాటిని నానబెట్టి ఉడికించితే వాటి కణ కవచం పగిలి రుచి వస్తుంది. బఠాణీల లో పిండి పదార్ధము , protein , vitamin A , B6,  C, K , ఖనిజలవణాలు ఉంటాయి.వీటిని ఉడికించి తినడం మంచిది.    
black eyed pea/ lobia/ goat pea/ California Blackeye తెల్లఅలచందలు-Vigna unguiculata (L.)Walp., వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. protein 13.%, folate 356mg , ఉంటాయి. వీటిని నానబెట్టి ఉడికించి వాడుకోవాలి. పచ్చివి కూరగా వండుకుంటారు.    
అలసందలు, బొబ్బర్లు 
moth bean/Turkish gram Vigna aconitifolia ఎర్రఅలచందలు, కుంకుమ పెసలు/ నాటు /దేశిఅలచందలు : దీన్లో 23 %protein, calcium 150mg ఉంటాయి. వీటిలో మిగిలిన పప్పులవలె anti-nutritional factors చాలా తక్కువ. నాన బెట్టి ఉడికించి తినవచ్చు . మెట్ట ప్రాంతపు వారికి మంచి పోషకాహారం. తెల్లవాటికన్నా ఎర్రవి మంచివి . 
 Horse gramఉలవలు- Macrotyloma uniflorum (Lam.)Verdc.,దీన్లో protein తో బాటు ఇనుము, molybdenum ధాతువులు ఎక్కువగా ఉంటాయి. దీని తొక్కలో anti-oxidents, polyphenols , flavanoids  ఉంటాయి కాబట్టి దీన్నిపప్పుగా కాక,ముడి గానే తీసుకోవాలి. నానబెట్టి ఉడికించినపుడు దాన్లోని trypsin inhibitor నశించి అది జీర్ణమయి పోషకాలు వంట బడతాయి. వీటిని శరీరానికి నీరు పెట్టినపుడు ఔషధం గా ఆహారంలో ఇస్తారు. ఇది insulin resistance ను తగ్గిస్తుంది కాబట్టి sugar వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారం.        
kidney beansరాజ్మా -Phaseolus vulgaris -is also known as kidney beans. వీటి పచ్చి కాయలను బీన్స్ అంటారు. హైబ్రిడ్ రకాల్లో విత్తనం ఎరుపు, మచ్చలతో, తెలుపు రంగులలో వేరు వేరు గా  ఉంటుంది.,వీటిలో protein ఇతర పోషకాలు బాగా వున్నా  వీటిని బాగా నానబెట్టి కనీసం 10నిముషాలు ఉడికించిన తరువాతే తినాలి. పచ్చి వాటిలో Phytohaemagglutinin అధికంగా ఉంటుంది. ఇది విష పదార్ధము . తిన్న 3 గంటలలో వికారం, వాంతులు రావచ్చు.    
అనపచిక్కుడు-Lablab purpureus (L.) Sweet, Lablab purpureus subsp. bengalensis (Jacq.) Verdc.,
Red lentil/masoor dal  యెర్ర కందిపప్పు- Lens  culinaris దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు. దీనిలో protein అధిక పాళ్ళలో ఉన్నప్పటికీ ఖనిజ లవణాలను గ్రహించే enzyme లను నిరోధించే phytates ఎక్కువగా ఉంటాయి. బాగా నానబెట్టి ఉడికించి తింటే మంచివి.  
సోయా బీన్స్- Glycine max(L.)Merr., ఇది పప్పు గాను, నూనె గింజగాను ఉపయోగపడుతుంది. దీనిలో 36% ప్రోటీన్, 20% నూనె , 30% పిండిపదార్థాలు ఉంటాయి. పచ్చి సోయా విత్తనాలు జీర్ణము కావు ,విషము. సోయా విత్తనాల్ని12 గంటలపాటు  నానబెట్టి /మొలకకట్టిన తరువాత, ఆవిరిలో ఉడికించి/ వేయించి మాత్రమే తినాలి. అపుడే వీటిలో వున్న trypsin inhibitors నాశనమవుతాయి. పండే పంటలో 85% process చేయబడి soya meal, soymilk, tofu, sauce, గా మార్చబడుతుంది.చాలా మందికి సొయా allergy ఉంటుంది. మాంసకృతులు చౌకగా పొందవచ్చు. known as poor men's meat.      
పప్పులు ప్రధానంగా మాంసకృతుల ను పొందడానికి ఉపయోగ పడే ఆహారం .పప్పులన్నిటిని బాగా నాన పెట్టి వండుకుంటే సులభంగా ఉడుకుతాయి, చక్కగా జీర్ణమవుతాయి .
Warning: పచ్చి బఠాణి , కంది పప్పు, పసుపు మొదలైన వాటికి మెటాలిక్ రంగులు కలుపు తుంటారు అపుడు అవి ముదురు రంగులో ఆకర్షణీయం గా ఉంటాయి, వాటిని తింటె కాన్సర్ వస్తుంది.  
3. నూనెగింజలు:  పురాతన కాలమునుండి వాడుకలో వున్నవి 
ఒకప్పుడు నూనె గింజలను గానుగ పట్టి వడగట్టి వాడు కునే వారు. అటువంటి నూనెను cold pressed oil అంటారు , దీనిలో పోషకాలు సమృద్ధి గా ఉంటాయి , కానీ రసాయనాలను వుపయోగించి చేసే refined నూనెలలో కొవ్వు పదార్ధము తప్ప పోషకాలుండవు . 
1. నువ్వులనూనె Gingelly oil/ Sesamum oil -Sesamum indicum L.,: దీనిని వేద కాలమునుండి మన దేశములో వాడుతున్నారు. దీనిలో monounsaturated fatty acid అయిన Oleic acid, polyunsaturated fatty acid(PUFA) linoleic acid కలిపి 85% శాతం ఉంటాయి. vitamin K  సమృద్ధి గా లభిస్తుంది. అందువల్ల ఆరోగ్యానికి మంచిది .  ఇది స్థిరమైన నూనె. త్వరగా చెడిపోదు. సహజమైన సువాసన  రుచి ఉంటాయి. అన్ని రకాల వంటల తయారీకి , నిల్వ పచ్చళ్లకు ఇది శ్రేష్టమైనది.  ఖరీదు ఎక్కువయినందువలన ఇతర నూనెల వాడుక బాగా ఎక్కువయినది. 
2.వేరుశనగ నూనెArachis hypogea L., ఇది కూడాస్థిరమైన నూనె. త్వరగా చెడిపోదు. దీనిలో monounsaturated fatty acid అయిన Oleic acid, ,polyunsaturated fatty acid(PUFA) linoleic acid  ఉంటాయి.vitamin E  ఉంటుంది. అన్ని రకాల వంటల తయారీకి ,వేపుళ్లకు మంచిది. సహజమైన రుచి ఉంటుంది. 
3. కొబ్బరి నూనె Coconut oil-Cocos nucifera L.,పురాతన కాలం నుంచి కేరళ రాష్ట్రం లో దీన్ని వంట నూనె గా వాడతారు.సువాసన, రుచి ఉంటాయి . దీనిలో lauric acid అనే సంతృప్త fatty acid ఉండడం వలన ఇది రక్తంలో cholesterol స్థాయులు పెరగడానికి కారణమౌతుంది . అయితే HDL -మంచిcholesterol కూడా పెరుగుతుంది. అందువల్ల వనస్పతి వంటి వానికన్నా కొబ్బరి నూనె మంచిది. పరిమితంగా వాడుకుంటే ఆరోగ్యానికి మేలు . 
4. ఆవనూనె/ Mustard oil- Brassica nigra L.,ఉత్తర భారత దేశంలో దీనిని వంట నూనె గా వాడతారు. ఇది ఘాటు గా ఉంటుంది. allyl isothiocyanate అనే గంధక పదార్ధము వల్ల  ఘాటు వస్తుంది. నల్ల,గోధుమ, తెల్ల ఆవాలను నూనె తీయడానికి వాడతారు.  దీనిలో 60% monounsaturated fatty acids (42% erucic acid and 12% oleic acid) , 21% polyunsaturated fats (6% the omega-3 alpha-linolenic acid and 15% the omega-6 linoleic acid ఉంటాయి. అయితే  erucic acid ఎలుకల్లో హాని కలిగించిందని దీని వాడకంపై కొన్ని పశ్చిమ దేశాల్లో నిషేధం వుంది. కానీ వేల  సంవత్సరాల నుండి ఈ నూనె తింటున్న మనుషులకు ఏమి కాలేదు. 
5. ప్రొద్దుతిరుగుడు నూనె/Sunflower oil - Helianthus annuus L., దీనిని ఇటీవలి కాలం లో వాడుతున్నాము . ఈ నూనె లో కూడాmonounsaturated fatty acid అయిన Oleic acid, polyunsaturated fatty acid(PUFA) linoleic acid ఉంటాయి.vitamin E ఉంటుంది. అయితే గాలిలోని తేమ, కాంతి, వేడి వల్ల త్వరగా oxidisation  కు గురై చెడి పోతుంది. Refined Sunflower oil లో యే విధమైన పోషకాలుండవు . రుచిగా ఉండదు. ముడి Sunflower oil అధిక వేడి దగ్గర చెడిపోతుంది , వేపుళ్లకు పనికి రాదు. దీన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. 
 6. పామాయిల్ Elaeis guineensis Jacq.,: దీన్ని ఆఫ్రికా లో 5000సంవత్సరాల నుండి తింటున్నారు. దీనిలో kernal నుండి తీసే red palmoil లో antioxidants-alpha-carotene, beta-carotene and lycopene అధికంగా ఉంటాయి. అయితే refined palmoil లో ఇవి వుండవు. Saturated fatty acids అయిన Palmitic acid అధికంగా ఉంటుంది . దీనివల్ల గుండె జబ్బులు వస్తాయి . ఇది చవకగా దొరికే నూనె.
7. వరి తవుడు నూనె Rice bran oil-Oryza sativa L., దీనిలో వేరుశనగ నూనెలో వున్నట్లే monounsaturated fatty acid అయిన Oleic acid, ,polyunsaturated fatty acid(PUFA) linoleic acid, vitamin E ఉంటుంది. అయితే దీనిలో phytosterols ఉంటాయి. . γ-oryzanol,α-Linolenic acid (ALA)-omega-3) fatty acid ఉంటాయి .ఇది రక్తంలో cholesterol స్థాయులు తగ్గడానికి, HDL -మంచిcholesterol పెరగడానికి తోడ్పడుతుంది. అయితే Calcium తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. మంచి రుచి ఉంటుంది. స్థిరమైన నూనె కావున తొందరగా చెడదు, వేపుళ్లకు అనువైనది.     
 8. 
కుసుమ నూనె/ Safflower oil /Saffola- Carthamus tinctorius L., ఇది రంగు రుచి లేని తేలికపాటి నూనె. దీనిలో ప్రధానంగాmonounsaturated fatty acid అయిన Oleic acid, ,polyunsaturated fatty acid(PUFA) linoleic acid,ఉంటాయి. α-Linolenic acid ఎక్కువగా వున్నవి మంచివి. అయితే Saffola పేరుతో దొరికే నూనెల్లో 80% తవుడు నూనె Rice bran oil, 20% -కుసుమ నూనె ఉంటుంది. ఇది వేపుళ్లకు పనికి రాదు. పోషకాలుండవు. ఖరీదు ఎక్కువ.       
9. సోయా నూనె/ soyabeanoil - Glycine max,దీనిలో linolenic acid  ఎక్కువగా ఉండడం వలన తొందరగా ఆక్సికరణ వలన పాడయిపోతుంది. NNitrosodi-n-butylamine అనే కాన్సరు కారక పదార్ధముంటుంది. ఇది వేపుళ్లకు పనికి రాదు.   
10.ఆలివ్ ఆయిల్ / Olive oil Olea europaea L., - ఇది మన దేశములో పండదు. దిగుమతి చేసుకున్న నూనెను వంటల్లో వాడుతున్నారు. ముఖ్యంగా సలాడ్లు, తక్కువ వేడిలో వండే వాటికి వాడొచ్చు. Virgin oil ఆరోగ్యానికి మంచిది.   ఖరీదైనది కావడం వలన కల్తీ బాగా జరుగుతుంది. 
11. పత్తి నూనె వంటి తక్కువ రకపు నూనెలను hydrogenate చేసి వనస్పతి, డాల్డా తయారు చేస్తారు.దీన్ని తీపి పదార్ధాల తయారీకి వాడుతుంటారు .  వీటితో చేసిన వంటలు తింటే cholesterol పెరిగి గుండె జబ్బులు, sugar, ఊబ కాయం వస్తాయి.    
 నూనెల్లో చాలాసార్లు పెట్రో సంభందిత నూనెలను , జంతు కళేబరాల నుండి తీసిన నూనె ను  కలుపుతున్నారు. 
వేరుశనగ నూనెలో ఆముదం , ముడి పామాయిల్ కలపడం కూడా కల్తీయే ;  ఆవాలు , నల్ల నువ్వులలో పిచ్చి కుసుమ విత్తనాలను కలిపి నూనె తీస్తుంటారు . ఇది హాని కారకము. 
 4. సుగంధ ద్రవ్యాలు(Spices): 
సుగంధ ద్రవ్యాలు 
1. మిరప కాయలు chilliCapsicum annuum L.,&Capsicum frutiscens (పచ్చివి , పండువి , ఎండినవి ): 15 వ శతాబ్దములో పోర్చుగీసు వారు మిరప కాయలను మనకు పరిచయం చేశారు. ఇది దక్షిణ అమెరికా కు చెందిన మొక్క. మన దేశములో 6-7 రకాల మిరప కాయలు ప్రధానం గా సాగు చేయ బడుతున్నాయి. Capsicin అనే పదార్ధము మిరపలో కారానికి కారణం. తొక్క దళసరి గా వుంది, కారం తక్కువగా వుండే వరంగల్ మిరపకాయలను తినదగిన రంగు తయారీకి ఉపయోగిస్తారు. ఇది రుచిని ఇస్తుంది. తక్కువ మోతాదులో జీర్ణ కారి. 
2.  పసుపు Turmeric- Curcuma longa L., పసుపు లేని ఇంటిని ఊహించలేము . కొన్ని వేల సంవత్సరాలుగా వాడుతున్నదినుసు . భూమిలో పెరిగే కొమ్ము ను ఉడికించి,ఎండబెట్టి నిలవచేస్తారు. ఇది రంగునిచ్చే పదార్థముగా , సువాసనకు, సూక్ష్మ జీవులను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది .అందువల్ల నిల్వ పదార్ధాల్లో పసుపు తప్పని సరిగా వాడతారు .  curcumin అనేది ప్రధాన పదార్ధము. ఇది అనేక రకాల వ్యాధుల ను నివారించడం లో ఉపయోగ పడుతుంది.ఇది వాపులను కొద్ది మోతాదులో తగ్గించ గలదు. పేగుల్లో వచ్చే కొన్ని సమస్యలను సమర్ధముగా ఎదుర్కోగలదు .  రోజుకు 100 గ్రాములకన్నా ఎక్కువ వాడితే హానికరం. కొన్ని రకాల పచ్చి పసుపుకొమ్ములను కూరగా వండుకుంటారు. 
3. వెల్లుల్లి Garlic- Allium sativum L., దీన్ని  సువాసన రుచి కొరకు కూరలు,నిలవ పచ్చళ్ళల్లో , అనేక రకాలు గా వాడతారు. Allicin ప్రధాన oleoresin. గంధకం వలన  ఘాటుగా ఉంటుంది.  ఇది  anti-bacterial, fungicidal and insecticidal; రక్తంలో cholesterol తగ్గిస్తుంది.
Note: క్షీర సాగర మధనము తర్వాత అమృతం పంచే సమయంలో రాహు కేతువులు దేవతల వలె మారి వారి మధ్య కూర్చొని కొంత అమృతాన్ని గ్రహించ గలిగారు . అది గ్రహించిన విష్ణువు తన సుదర్శన చక్రంతో తలా ఖండించినపుడు ఒక చుక్క అమృతం భూమి పై పడి ఉల్లి , వెల్లుల్లి మొక్కలుగా పుట్టాయని పురాణ గాథ. అందువల్ల దేవునికి నివేదించే ప్రసాదాలలో, కొన్ని శుభ కార్యాలలో దీనిని వాడరు.    
4. అల్లము Ginger -Zingiber officinale Rosc., తాజా అల్లము  రుచి, సువాసన కొరకు కూరలు, పచ్చళ్ళు, ఊరగాయల్లో వాడతారు. ఆకలి పుట్టించడంలో , కఫహారిగా ఎంతో కాలంగా వాడుకలో వుంది. అల్లాన్ని సున్నపు తేటలో ఉంచి ఎండబెడితే దాన్ని శొంఠి అంటారు. దీన్ని పొడిచేసి వంటల్లో, ముందుగా వాడుకుంటారు. ప్రధాన రసాయనం Zingirin అనే oleoresin 
5. ఆవాలు Mustard -Brassica nigra, ఆవాలను సువాసన , రుచి కొరకు వంటల్లో వాడతారు. ఆవ పిండి ని కొన్ని కూరల్లో, నిల్వ/ తాజా పచ్చళ్ళల్లో  ప్రత్యేకంగా వాడతారు. ఆంధ్రుల ఆవకాయ జగత్ప్రసిద్ధమే  కదా . దీనిలోని sulpher వలన  ఘాటు గా ఉంటుంది. 
6.మెంతులు Fenugreek - Trigonella foenum-graecum L.:కూరలు పచ్చళ్ళల్లో రుచి , సువాసన కు వాడతారు . ఆకుకూరగా వాడతారు. ఎండ బెట్టిన ఆకులను సువాసనకు వాడతారు. మెంతులను పొడిగా కానీ, నాన బెట్టి కానీ మధుమేహ వ్యాధి గ్రస్తులు వాడుకుంటారు    The seeds are used in colic flatulence, dysentery, diarrhoea, dyspepsia, chronic cough and enlargement of liver and spleen, rickets, gout and diabetes.
7. ధనియాలు/కొత్తిమీర Coriander- Coriandrum sativum L.:ఇది మనందరికీ సుపరిచితమే; పచ్చి ఆకును కొత్తిమీర గా వాడని వారుండరేమో ; ఇది రుచి, సువాసన తో బాటు పోషకాలను ఇస్తుంది . ఎండిన ఫలాలను ధనియాలు అంటారు . వీటిని వాడని వారుండరేమో . ధనియాల  కషాయాన్ని జ్వరం, కడుపులో వికారము  వున్నపుడు పొడిచేసి తింటే కొంచెం ఉపశమనం ఉంటుంది.   It is useful in  fever, stomach disorders, and nausea. 
8. జిలకర Cumin- Cuminum cyminum L.: జీర్ణకారి, సువాసన కారి. stimulant, carminative, stomachic and astringent. 
9.ఇంగువ Hing/Asafoetida  Ferula asafoetida H.Karst.:ఘాటు గా వున్నా రుచి, సువాసన, తో బాటు ఆరోగ్య కారి ; కడుపులో వాయువు బైటికి వెళ్ళడానికి తోడ్పడుతుంది.  flavouring curries, sauces, and pickles. It is also used in medicines because of its antibiotic properties.
10.మిరియాలు Black pepper- Piper nigrum L.: Used in cooking for taste and flavour; it is analgesic, anti-pyretic, anti-oxidant and anti-microbial.
11. ఏలకులు Cardamom- Elettaria cardamomum (L.)Maton,Used for flavouring. 
12. లవంగాలు Clove-Syzygium aromaticum (L.)Merrill & Perrydentistry, oral and pharyngeal treatments. 
13. దాల్చిన చెక్కCinnamon- Cinnamomum verum J.Presl.,Used in flavouring confectionary, liquors, pharmaceuticals and cosmetics. It is found to help diabetics in digestion of sugar. It has astringent; stimulant and carminative properties and can check nausea and vomiting.  
14. జాజికాయ, జాపత్రిNutmeg and mace- Myristica fragrans Houtt., Nutmeg is used as condiment,and flavouring agent; mace is stimulant, carminative, astringent and aphrodisiac properties. Excessive doses have a narcotic effect. 
15.కరివేపాకు Curry leaf-Murraya koenigii Spreng.,tonic, stimulant, carminative and stomachic
16. వాము,Bishops weed/ Azwain- Trachyspermum ammi (L.) Sprague, It is used as a digestive aid, relieves abdominal discomfort due to indigestion and antiseptic.
17.  సోంపు Fennel- Foeniculum vulgare Mill.,Dried fruits have fragrant odour and pleasant aromatic taste; used for flavouring; they are stimulant and carminative.
18. సీమ జిలకర/ షాజిర Caraway seeds-  Carum carvi L.,used as a spice for culinary purposes and for flavouring. 
19.  నల్ల ఏలకులు-Black cardamom- Amomum subulatum Roxb.,A flavouring agent in meat and non-vegetarian dishes. 
20. అనాసపువ్వు-Star Anise- Illicium verum Hook.f.,It is used as a condiment for flavouring chinese curries, pickles, soft drinks, bakery products and liquors.It is anti-bacterial, carminative, diuretic and stomachic, useful in flatulence and spasmodic. 
21. బిర్యానీ ఆకుTejpatta-Cinnamomum tamala (Buch-Ham.) T.Nees&Eberm.,It is used as flavouring agent.It is stimulant and carminative. 
22. పుదీనా mint- Mentha piperita, Mentha arvensis-It is used as flavouring agent.it is used against stomach disorders, rheumatism; dried plants are stimulant and carminative.  
23. గసగసాలు  (Khas Khas)Poppy seeds- Papaver somnifer L., Seeds are nutritive,  demulcent and are used against constipation. 
24. కుంకుమపువ్వు Saffron- Crocus sativa L., Used as colouring and flavouring agent; it is used in fevers, melancholia, and enlargement of liver and spleen. In Ayurvedic medicine it is used to heal arthritis, impotence and infertility.
25. చింతపండు Tamarind Tamarindus indica L., Used for taste in cooking; it is used as appetizing, laxative, healing and anti-helmintic, and against fluorosis medicinally.
, మొదలైనవి           
continued ......

Tuesday, April 24, 2012

మన ఆకు కూరలు,తినదగిన పూలు, కూరగాయలు


మన ఆకు కూరలు : Our leafy vegetables and vegetables.(REVISED)
Inspiration : ఆంద్ర ప్రదేశ్ లో ఆకు కూరలు -A book published by Telugu Academy.
I wish to introduce some non traditional leafy vegetables to the present generation. These leaves were cooked by our elders to prevent or alleviate some health problems at least once or twice in the year. Let me introduce them with photographs and botanical names and vernacular names:
1. Our traditional leafy vegetables are in common use: They are తోటకూర, తెల్ల గోంగూర, ఎర్రగోంగూర(పుంటి కూర );చుక్కకూర,తీగ బచ్చలి, చిర్రి కూర, మొలక కూర/ దంటు కూర ,కొయ్యగూర, పెరుగుతోటకూర, పాలకూర ; మెంతికూర, పుదినా, కొత్తిమిర; కరివేపాకు, ఉల్లి కాడలు, కాబేజీ ,సోయకూర, చింతచిగురు. ఇవి కాక మరెన్నో ఆకులను కూడా తిన వచ్చును . అవి అంతగా వాడుక లో లేవు, వాటిని సంప్రదాయేతర ఆకు కూర లు అంటారు. అవి ఆరోగ్య ప్రదాయనులు. వాటి గురించి మీ అమ్మమ్మ లేదా బామ్మ లను అడిగితే చెప్తారు. వాటిని పరిచయం చేయాలని అనిపించి ఈ సమా చారం ఇస్తున్నా.
వీటిలో ఒక్కో ప్రాంతం లేదా జిల్లా లో కొన్నిటిని తింటారు, నెల్లూరు లో తినే వాటిని గోదావరి జిల్లాల్లో తినరు లేదా తింటారని తెలియక పోవచ్చు, కానీ తెలుగు వాళ్ళు వాడే ఆకులన్నిటిని పరిచయం చేస్తున్నాను.ఇవి విషం కావు, కానీ కొందరికి అలెర్జీలు రావచ్చు, అపుడు మానెయ్యండి. ఈ ఆకులను కలిపి వండుకోవచ్చు; వీటిని కలగూర అంటారు . ఆకులు సేకరించేటప్పుడు మురికి గుంటల వద్ద కాక పొలం గట్ల వద్ద నుండి సేకరించండి.          
Non traditional leafy vegetables which have been in use by some people only; and they may be used by any one if found in unpolluted areas for the same advantages that our elders got. All most all these leafy vegetables contain considerable amount of Calcium, Iron and Phosphorous.         
Family: Amaranthaceae
1.పొన్నగంటి కూర:
Botanical name: Alternanthera sessilis (L.) R.Br.; 
Common in moist areas along the canals and ponds.
It is rich source of Iron, Phosphorus, Calcium , Riboflavin and Carotene.
Alternanthera sessilis ( పొన్నగంటి కూర)
It is tasty and good for skin and eyes.
Alternanthera philoxeroides
But now cultivated ponnaganti is sold in markets which is nothing but Alternanthera philoxeroides (Mart.) Griseb.; it is an accumulator of heavy metals like Cadmium and Mercury in the surrounding water, when it is eaten metal poisoning may cause some serious problems.
2.ఉత్తరేణి ఆకు : అపామార్గము
Uttareni:Botanical name: Achyranthus aspera L.It is useful to remove worms in the stomach. The shade dried powder is used to relieve phlegm. It can be cooked with tamarind and dal.
ఉత్తరేణి Achyranthus aspera 
3.పిండి కూర:Pindikura:
Botanical name:  Aerva lanata L. Those who are suffering from urinary stones used to eat it, as it dissolves or prevent formation of stones. It can be coked with dal; only tender leaves are to be cooked like Amaranth or Alternanthera
పిండి కూర
4.అడవి గురుం గూర:
Adavigurungura: Botanical name: Allmania nodiflora(L.)R.Br It can be cooked with dal like Aerva .
Allamania nodiflora; అడవి గురున్గూర 

5.చిలక ముక్కాకు:
 Botanical name: Amaranthus viridis L. It can be cooked with dal like thotakura, it tastes almost thotakura like. It  relieves  worms  in  stomach.   
Amaranthus viridis ;చిలక ముక్కాకు 
6. ముళ్ళ తోట కూర:
Botanical name: Amarantus spinosus L.- It contains carotene, Vit.C; improves apettite, It is tasty also.and improves lactation in newly delivered mothers. బాలింతల కు క్షీర వర్ధిని;only leaves without spines have to be cooked)
ముళ్ళ తోట కూర
7.గురుగు/ గురుంగూర: (బతుకమ్మ పూలు ) 
Botanical name: Celosia argentia L. లేత ఆకులు వండుకుంటారు. It can be cooked with dal, In Telangana districts the plant is used to decorate Bathukamma.

గురుగు Celosia 
8.చెంచలాకు:
Chenchallaku:Botanical name:  Digera muricata (L.) Mart ,It can be cooked with dal
 Digera muricata; చెంచాలాకు 
9. పప్పుకూర :చక్రవర్తికూర,
ఇది పొలాల్లో కలుపు లాగ పెరుగుతుంది.   
Botanical name: Chenopodium album L. 
It can be cooked like Amaranthus 
Chenopodium album
Family Brassicaceae
నల్ల ఆవాల ఆకు :Brassica nigra L.,   
లేత ఆవకూరను రాజస్థాన్, పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాల్లో  పప్పుతో కలిపి వండుకుంటారు ;
 ముల్లంగి (Raphanus sativus L.) ఆకులను ఉత్తర భారత దేశము లో వండుతారు. కాలీ ఫ్లవర్ (Brassica oleracea L.)ఆకులను కూడా వండు కోవచ్చు. ఇవి రుచికరంగా ఉంటాయి   
Family : Portulacaceae
వంగరేడుకూర Vangaredukura: Botanical name:  Sesuvium portulacastrum (L.) During famine times the fishermen community used to cook these leaves and eat to satiate their hunger. Instead of adding salt this plant is cooked with fish or crabs or some other dishes by the local fishermen.(ఒక సారి ఉడకబెట్టి ఆ నీరు వంపేసి తరువాత వాడుకోవాలి) 
Sessuvium portulacatstrum; 
2.పప్పు కూర,గంగబాయలి కూర, పాయలాకు :
 Pappukura, Gangabailikura, Payallaku: Botanical name:Portulaca oleracea L. Var oleracea Can be cooked with dal.It contains carotene, riboflavin,vit.C, and oxalic acid; It is useful in kidney and liver diseases శరీరం లో నీరు పట్టి నపుడు ఉపయోగం గా వుంటుంది.
గంగాబాయిలి కూర 
బడ్డు:Baddu : Botanical name:Portulacatuberosa L.Can be cooked with dal
Portulaca tuberosa; బడ్డు కూర 
Family: Aizoaceae
తెల్ల గలిజేరు:Tellagalizeru:
 Botanical name: Trianthema portulacastrum L. There are 2 varieties, one is white another one is reddish; both are edible.It is useful for diabetic patients.It can be cooked with dal.It contains considerable amount of carotene and Vit.C; It contains oxalates, hence it is not advisable for those who are prone to kidney stones; and for pregnant women.
తెల్ల గలిజేరు 


గలిజేరు 

Family: Lamiaceae

తుమ్మి కూర:Thummikura:
Botanical name: Leucas aspera Willd. It is eaten to relieve respiratory problems. తుమ్మి కూరతో లేత చింత కాయలు కలిపి వండుతారు. It can be cooked with Redgram and tamarind. దక్షిణ కోస్తా, రాయల సీమ లో కార్తీక మాసం లో, వినాయక చవితి కి తెలంగాణా లో, శివ రాత్రి కి చాలా ప్రాంతాల్లో వండుకుంటారు.   eating this leafy vegetable is  a tradition in some communities after the fast. 
Leucas aspera; తుమ్మి కూర

వామాకు / కప్పు రెల్లి/కర్పూర వల్లి  ఆకు :
 Botanical name: Coleus ambonicus ; It can be used in variety dishes, such as salads etc., It relieves stomach ache, cough and cold.
Coleus, వామాకు 
Family: Apiaceae
కొత్తిమీర ఈ కుటుంబానికి చెందిందే 
సరస్వతి ఆకు: Saraswathiaaku:
Botanical name:  Centella asiatica L.It is a proven Ayurvedic medicinal plant. used to improve memory in children. It is cooked as chutney. 
Centella asiatica; సరస్వతి ఆకు 
 Anethum sowa Roxb. ex Fleming  : సోయకూర, పెద్ద సదాపార:ఇది జిలకర ఆకు లాగా ఉంటుంది. తెలంగాణా లో దీన్ని బాగా వాడతారు. 
నల్లేరు :
Botanical name: Cissus quadrangularis L. ;Family: Vitaceae
  young shoots along with leaves cooked; a mdeicinal herb to strengthen bones. దీని లేత ఆకులను కాడలను పచ్చడి చేసుకుని తినవచ్చు. నల్లేరు కాడలను చిన్న ముక్కలుగా తరిగి ఊతప్పం వంటి వంటలలో  వేస్తారు. నల్లేరు ను  దంచి గుజ్జును మినప అప్పడాల తయారీ లో వాడతారుఇది ఎముకలు బలపడటానికి for improving cartilage, ఉపయోగ పడుతుంది. దీన్ని వజ్రవల్లి అని కూడా అంటారుఇది అద్భుత ఔషధము. ఎముక విరిగి నప్పుడు చాలా ఉపయోగము  
Cissus quadrangularis నల్లేరు 
చేమ ఆకులు :
Botanical name:Colacasia esculenta ; Tender leaves cooked with dal, or with tamarind; It is useful in piles. The leaves controls bleeding from nose; 
Caution: కాలువ గట్ల మీద పెరిగే వి తినరాదు ;ఆకులు దురద పెట్టకుండా లేత వాటిని ఉడికించి తినాలి.  Better pot a few tubers in your homes.
Colacasia esculenta చేమ ఆకులు 
గుంటగలగరాకు: 
Guntagalagaraaku:Botanical name:  Eclipta alba Hassk /Eclipta prostrata L.Family: Asteraceae
It is used in jaundice.It can be cooked like chutney with Amla when suffering from jaundice. 
Eclipta alba. 
వామింట:Vaaminta: Family: Cleomaceae
Botanical name: Cleome gynandra L. It is a rich source of nutrients, but not so tasty, hence it may be cooked with dal.ఆకలి పుట్టిస్తుంది , మూల వ్యాధి నివారణ కు ఉప యోగ పడుతుంది.కొంచెము వాసన కలిగి ఉంటుంది 
వామింటాకు cleome gynandra
సిలోన్ బచ్చలి; Ceylone bachali:
Botanical name: Talinum portulacifolium Forsk. These three are good for gastric ulcer patients. It can be cooked with dal. The leaves are succulent, and mucilagenous, not sour or bitter.చప్పగా రుచి లేకుండా ఉంటాయి . 
Talinium portulacifolium
Family: Malvaceae
 చిట్టింత కూర, చిట్టింటాకు; సిత్నాట కుర :  
:Botanical name: Melochia corchorifolia L. ;cooked fresh or dry, preserve, and can be cooked with dal, it controls loose motions.
Melochia corchorifolia చిట్టింతాకు 
కలాస కూర;నేల బీర: 
Botanical nameCorchorus aestuans ; It is useful in stomachache due to worms. It can be cooked with dal.
Corchorus aestuance కలాస కూర 
Family: Solanaceae
కామంచి ఆకు, కాచి కూర 
Botanical name: Solanum nigrum L.;
 The leaf is useful in urinary and liver problems. ఆకును వాడ్చి పచ్చడి గా, ఇతర ఆకులతో కలిపి పప్పుకూరగా వండుకుంటారు. The ripe fruits are dried and used in curries. పండ్లను ఉప్పు, వాము తో  కలిపిఎండబెట్టి వరుగు లాగ చేసి నిల్వ ఉంచుతారు . వీటిని నూనెలో వేయించి   తింటారు.  
Solanum nigrum ;కామంచి 
 ఎలుక చెవి కూర:
Botanical name: Merremia gangetica L.; Family: Convolvulaceae
 It can be cooked with dal. To control anaemia, cough and asthma it is used. If eaten in large quantities constipation may result in.
Merremia gangetica ఎలుక చెవి కూర 
 అటక మామిడి:పునర్నవ:
 Botanical name: Boerhavia diffusa ; Family: Nyctaginaceae
 It is used in urinary problems. ఆయుర్వేదం లో మూత్ర సంభందిత సమస్యలకు దీన్ని ఒక ఔషధం గా వాడతారు ; పప్పు తో కలిపి వండుకో వచ్చు . 
Boerhavia diffusa; అటక మామిడి 
విటమిన్ల కూర:
 Botanical name: Sauropus androgynus L.; Family: Phyllanthaceae
It is a rich source of vitamins. It can be cooked with dal or used in salads or with tamarind. But consumption in high quantities may be avoided.
విటమిన్ల కూర Sauropus androgynous
గరిక:
 Botanical nameCyanodon dactylon L.Family: Poaceae; ఇది వినాయకుణ్ణి పూజించడానికి వాడే గడ్డే; ఆయుర్వేదం లో దీనికి ఔషధ లక్షణాలు వున్నాయి . లేత ఆకులను పచ్చడి లాగ చేసుకుంటారు  Controls bleeding, and useful in skin diseases.Tender leaves can be cooked.
Cynodon dactylonగరిక 
 బొక్కెనాకు : 
Phyla nodiflora -Family: Verbenaceae 
not tasty, but for used in urinary problemsదీనికి రుచి ఉండదు.అజీర్తి, మూత్ర సంభంద వ్యాధులు గల వారికి చలవ కొరకు దీన్ని వండి పెడతారు. 
Phyla nodiflora బొక్కెనకు 
ఏనుగు పల్లేరు Pedalium murex   ఇది పిచ్చి మొక్కలాగా పెరుగుతుంది ; దీని ఆకులు మందంగా జిగురు గా ఉంటాయి .the leaves are eaten in small quantities వీటి ఆకులను ఆఫ్రికా లో, చైనా లో ఆకు కూరగా వండుకుంటారు. కాయలకు ముళ్ళు ఉంటాయి 
ఏనుగు పల్లేరు Pedalium murex
బొద్ది కూర : Botanical name: Rivea hypocrateriformis
బొద్ది కూర Rivea hypocrateriformis 
leaves are cooked with tamarind and eatenఇది తీగ. తెల్లటి పూవులతో ఉంటుంది. ఆకులను ఉడికించి పులుసు కూర లాగ వండుకుని తింటారు .
చందమామ కూర :
Botanical nameMarselia quadrifolia; It is Pteridophyte;నీటి మడుగుల వద్ద పెరుగుతుంది  It can be cooked with dal or as chutney.
Marselia quadrifolia చందమామ కూర 
 ఎదురు ఉత్తరేణి:
Botanical name: Stachytarpheta jamaisens Vahl . Can be cooked with dal
ఎదురు ఉత్తరేణి Stachytarpheta 
దీ న్ని తెలంగాణా రాష్ట్రం లో వాళ్ళు ఎక్కువ గా వాడుకుంటారు. ఆకు తో పచ్చ్చడి, పొడి, పప్పు తో కూర గా వండుకుంటారు.
బుడ్డ కాకర ;
Botanical name: Cardiospermum helicacabum. It contains minerals and proteins .It is diuretic, It may be cooked with dal.
Cardiospermum బుడ్డ కాకర 
నీటి గొబ్బి: 
Botanical name: Hygrophyla asiatica  ఇది నీటి గుంటల అంచుల్లో వరిపొలాల గట్ల పై పెరుగుతుంది , ముళ్ళు ఉంటాయి . వీటి లేత ఆకులను వండుకుంటారు.tender leaves cooked and eaten.

నీటి గొబ్బి Hygrophyla asiatica
Trichodesma zeylanicum (Burm.f.) R.Br.,Trichodesma indicum (L.) Lehm. దీన్ని గువ్వగుత్తి లేదా గుర్రంగుత్తి అంటారు. ఆకులపైన బిరుసుగా వున్న నూగు వుంటుంది. దీన్ని  మొన్న కూరల మార్కెట్ లో అమ్ముతుంటే చూసాను. చాలా ఆశ్ఛర్యమేసింది.  వీటి లో కొన్ని విషపూరిత ఆల్కలాయిడ్లు ఉంటాయి. వీటిని తక్కువగా నే తినాలి ; ఈ ఆకులను ఇతర ఆకులు లేదా కూరల తో  కలిపి వండుకుంటారు     
ఆకు కూరలు గా తినే చెట్ల ఆకులు:
చెన్నంగి ఆకు : దీని ఆకులను పచ్చడి చేసుకుంటారు. ఇది అడవిలో పెరిగే చిన్న చెట్టు , తెల్ల పూలు ఉంటాయి. Botanical name: Lagerstroemea parviflora ; Family: Lythraceae
Lagerstoemia parvifloraచెన్నంగి 

దేవదారు :
Botanical name: Erythroxylum monogynum Roxb. ఇది చిన్న చెట్టు లేదా పొద వలె అడవుల్లో పెరుగుతుంది It can be cooked with green gram. It is useful in indigestion, it is cooling. 
Erythroxylum; దేవదారు 
పులిచింతాకు:
ఈ పేరుతొ వున్న ఆకులను పరిచయం చేస్తాను. 
 ఇది నేల మీద పాకే చిన్న గుల్మము : Botanical name:  Oxalis corniculatum L. (Family: Oxalidaceae) It is used to control diarrhea ; it can be cooked as chutney or salad which is tasty.Useful in anemia and improves digestion.

 Oxalis corniculatum  పులిచింతాకు 
 Bauhinia malabarica ఇది పెద్ద చెట్టు, దీని ఆకులు కూడా పుల్లగా ఉంటాయి వీటిని కూడా పులిచింతాకు అంటారు, ఇవి గోదావరి జిల్లా అడవుల్లో ఉంటాయి. దీన్ని కూడా వండుకుంటారు.వీటి  ఆకులు మోదుగ ఆకుల్లాగా ఉంటాయి .  the leaves are sour to taste, eaten after cooked
చింత చిగురు, ఎండు  చింతాకు వాడకం అందరికి తెలిసినదే ఇవి కాక 
 అవిసె : Botanical name: Sesbania grandiflora; ఆకు ను పువ్వులను కూడా కూరగా పప్పుతో కలిపి వండుతారు.   It is cooked purely or with dal. It is eaten by ShriVaishnavas on Dwaadasi after Ekadasi fast. It dissolves urinary bladder stones, it is laxative; lactogouge. The leaves contain linolenic acid and Aspartc acid responsible for antiglycation.
Sesbania; అవిసె 
జొన్న పళ్ళు / పులసరి Antidesma ghasembilla వీటి పళ్ళను తింటారు;ఆకులను కూడా  వండుకుంటారు  ఆకులు పుల్లగా ఉంటాయి.  
బ్రహ్మ ఆమ్లిక
Brahma aamlika, :Botanical name  Adansonia digitata L.Family: Malvaceae  The leaves and pulp of the fruit are edible. They are cooked in Rajasthan. It is cooked through out Africa.I have tried fruit pulp it is tasty like tamarind

Adansonia
మునగాకు
Botanical name: Moringa oleifera Lam; పచ్చి ఆకులను ఉడికించి కూరగా లేదా పప్పుతో కలిపి లేదా పచ్చడి పొడి లాగ వండుకో వచ్చు leaves and fruit are used as edible. మునగ ఆకును నీడలో ఎండ బెట్టి పొడి చేసి కొన్ని వంటల్లో కలుపు కో వచ్చు . 
It contains Iron 5 times higher, 15 times higher in Calcium;Vitamin A 60 times higher, vitamin C 2 times higher than other leafy vegetables.it inhibits absorption of phyto iron.  
మునగ ;Moringa oliefera
బలుసు ఆకు ;
 Botanical name: Canthium dicoccum ;ఇదిముళ్ళ పొద; ఆకులు మందంగా ఉంటాయి   cooked as vegetable.it is cooling. Kills worms in the stomach, 
బ్రతికుంటే బలుసాకు తిన వచ్చునన్న సామెత వుంది.

Canthium
సముద్ర తీర ప్రాంతాల్లో వారు వాడుకునేవి  ఇల కూర; ఉప్పు ఆకు:
Botanical name: Suaeda maritima   
Suaeda; ఉప్పు ఆకు 
Salicornia and suaeda are available near salty marshes in the sea coast, they accumulate salt; they are cooked with fish and crabs with out adding additional salt.They are cooling.

కరివేపాకు గాక , సువాసనకు, రుచి, ఆరోగ్యానికి కొన్ని నిమ్మ జాతి మొక్కల ఆకులను కూరల్లో కలుపు తారు.నిమ్మ , దబ్బ , నారింజ ఆకులను చారు , మజ్జిగ లో సువాసనకు వాడుకోవడం తెలిసినదే ; ఇవి కాక మరి కొన్ని
కొండ కసిమింద
Zanthoxylum armatum ; the leaves are used like curry leaves for flavour.ఇది 3-7 దళాలు కల ముళ్ళతో వున్న ఆకు . వీటిని కూడా వంటల్లో సువాసన కొరకు వేసుకుంటారు . ఇవి కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది; వీటి పండ్లను బెంగాల్ లో మిరియాల్లాగా వంటల్లో వాడుకుంటారు
Zanxthoxylum armatum
కొండకసింత Toddalia asiatica  
దీని ఆకులను కూడా సువాసనకు వాడుకుంటారు    
  గొంజి/గొలుగు:
 దీని Botanical name: Glycosmis pentaphylla : cooked with rice and zinger.దీని ఆకులను బాలింతలకు ఆకలి పుట్టించడానికి , జీర్ణ సంబంధ వ్యాధులున్న వారికి వండి పెడతారు. అల్లం తో కలిపి అన్నంతో వండుతారు. ఇది కొంచెం నిమ్మ ఆకు లాగే వాసన తో ఉంటుంది. దీని పళ్ళు యెర్ర గా ఉంటాయి . తియ్యగా ఉంటాయి. 
Glycosmis pentaphyllaగొంజి 
 శీకాయ.Senegalia rugata (Lam.) Britton & Rose, , leaves cookedలేత శీకాయ ఆకుతో పచ్చడి చేస్తారు,
 Caralluma attenuata: the tender stems are cooked as chutney. in small quantities.కుందేటి కొమ్ములు : వీటికి ఆకులు వుండవు, ఆకు పచ్చటి కాడలను నల్లేరు లాగా పచ్చడి చేసుకుని తిన వచ్చును . ఇది కాకర లాగ చేదు గా ఉంటుంది. జీర్ణ కోశ వ్యాధులకు , మధుమేహ నియంత్రణకు కొన్ని గిరిజన జాతుల వాళ్ళు తింటారు. ప్రతిరోజూ కాకుండా వారానికి ఒక సారి మాత్రమే పరిమితం గా తినాలి. 
కుందేటి కొమ్ములు 
Leafy vegetables as Laxatives: మలబద్దకం వున్న వారికి సుఖ విరోచనం అయ్యేందుకు వాడుకునే కొన్ని ఆకులు . వీటిని పచ్చడి లాగా చేసుకొని లేదా పొడిని నీళ్లలో కలిపి లేదా కషాయంగా వాడుకుంటారు ఇవి చేదు గా ఉంటాయి These leaves are cooked as chutnies to relieve constipation. Hence only small quantities should be taken to clean our digestive system. అవి తూటి కూర,సునా ముఖి,నేలతంగేడు,ఉత్తరేణి; 
తూటి కూర: Thutikura:Botanical name: Ipomaea aquatica L.; నీటి గుంటల్లో బురద లో పెరుగుతుంది . Can be cooked with dal. Antidote for Arsenic poison and opium poison.Serves as laxative.
Ipomea aquatica ; తుటి కూర 
సునా ముఖి:
Senna, Sunaamukhi:;Botanical name:  Cassia angustifoliaVahl. / Senna alexandria gar.ex. Miller. The leaves and pods are dried and used as powder or cooked as chutney.The dried plants are exported to USA and Europe. It occupies first place in the export of medicinal herbs from India.
Cassia angustifolia సునాముఖి 
నేలతంగేడు: Nelatangedu: Botanical name: Cassia italica(Mill.)Spreng. The leaves and pods are dried and used as powder or cooked as chutney.
Cassia italica నేల తంగేడు 
 ఇవి ఆకు కూరలలో కలిస్తే తీసి పడవేయ కండి ఇవి ఏవి విషం కావు. పైగా ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఆకు కూరలను తాజావి , పరి శుభ్ర మైనవి, తీసుకోండి. రోజు ఒకే ఆకు కూరను తినవద్దు. oxalates ఎక్కువగా వున్నఆకు కూరలను ఉడికించి ఆ నీటిని పడవేయండి.ఆకు కూరలను పప్పు తో కలిపి వండితే వాటి లోని పోషకాలు  బాగా అందుతాయి. మునగాకు లోని కొన్ని పదార్దాలు ఇనుమును శరీరానికి అందకుండా అడ్డుకుంటాయి. కాబట్టి రక్త హీనత వున్న వారు ఇటువంటి ఆకులకు దూరంగా వుంటే మంచిది. అయితే కాల్షియం బాగా ఇస్తాయి. చింత పండును ఆకు కూరలతో వాడితే విటమిన్లు ఖనిజాలు నశించ కుండా కాపాడుతుంది. సాంప్ర దాయేతర ఆకు కూరలను ఎక్కువగా వాడ కండి. మందు లాగా అప్పు డప్పుడు వాడు కో వచ్చును. వండే   విధానం కుడా తెలుసు కొని వుండాలి.    
Besides these leaves; even the phylloclades of opuntia; buds of Cereus are cooked. of some cactus are also eaten. కొన్ని రకాల నాగ జెముడు మట్టలను కూడా తింటారు. All these require the proper method of cooking.

సాంప్రదాయేతర కూరగాయలు: కూరలు అనగానే గుర్తుకు వచ్చేవి వంకాయ, బెండకాయ, దోస,పొట్ల, సొర /ఆనప కాయ, బీర, దొండ, కాకర, చిక్కుడు,గోరు చిక్కుడు,  మునగ, టమాటో, మిరప, అరటి,కాబేజీ, కాలిఫ్లవర్ ప్రధానమయినవి; ఉల్లి, బంగాళా దుంపలు, కంద, చేమ, ముల్లంగి, కారట్, బీట్రూట్, వంటి దుంపలు; మామిడి, ఉసిరి, చింత, నిమ్మ పులుపు కొరకు,అల్లం , పచ్చి మిరప అందరూ వాడేవి. ఇవి కాక కొన్ని కాయలను పరిచయం చేస్తాను;        , 
1.అరటి పువ్వు, అరటి దూట ; (ఎర్రటి దొప్పలను తొలగించి లోపలున్న పువ్వులను తినాలి ) వీటిని కొందరు మాత్రమే వండుకుంటారు, ఇవి రక్తంలో వున్నా కొవ్వు కరిగించ డానికి, కడుపులో పూత ఉపశమనానికి వాడుకో వచ్చు . 
2. అత్తి/మేడి  కాయలు : పండనివి, ముదురు అత్తి కాయలతో కూర చేసు కుంటారు , ఇది మధు మేహులకు ఉపయోగం.
 3. వాక లేదా కలే కాయలు : వీటితో పచ్చడి , పప్పు చేసుకుంటారు , ఇవి పుల్ల గా ఉంటాయి . 4.పనస కాయల కూర అందరికి తెలిసినదే, అదే జాతికి చెందిన నక్కరేగు(Artocarpus lacoocha) కాయలను తింటారు.
 5. నక్క దోస అనే చేదు గా వుండే చిన్న దోస కాయలను వరుగు లాగ చేసుకుని తింటారు. ఇవి పొలాల్లో కలుపు లాగ పెరుగుతాయి . 
6. నేతి బీర కాయలు కొందరు తినరు , ఇవి కూడా తినవచ్చు , చప్పగా ఉంటాయి.
 7.కాకర, ఆగాకార కాయలు అందరికి తెలిసినవే ; కాసర కాయలు:ఇవి కాకర జాతికి చెందినవి, చిరు చేదు గా ఉంటాయి, కూర చేసుకుని తింటారు.వీటిని రాయల సీమలోని కొన్ని జిల్లాల్లో కొన్ని ఋతువుల్లో తింటారు . మధుమేహులకు బాగా ఉపయోగము . 
8. తంబ కాయలు : ఇవి చిక్కుడు జాతికి చెందినది , కాయలు వెడల్పు గా ఉంటాయి, కొంచెం పసరు వాసనతో ఉంటాయి , తినవచ్చు .
10. వెలగ : వెలగ కాయ గుజ్జు తో పచ్చడి, పప్పులో వాడుకోవచ్చు. బాగా పండినవి తినొచ్చు.    
11. కొండ మామిడి(Spondias pinnata) కాయలను ఊరగాయగా పచ్చడి గ చేసుకుంటారు. 12. రేవడి లేదా కళింగ చెట్టు కాయలు కొంచెం పుల్లగా ఉంటాయి వీటిని కూడా కూరల్లో తింటారు. 
13. Adansonia digitata  baobab అనే చెట్టు కు పెద్ద కాయలు కాస్తాయి , వాటిలో పీచు గుజ్జు విత్తనాలుంటాయి , గుజ్జు చింతపండు లాగ పుల్లగా ఉంటుంది, చింత పండు లాగ వాడు కో వచ్చు. 
14. ఉస్థి కాయలను వరుగు లాగ చేసుకుని తింటారు.   
ఇంకా వుంది 
15. లేత వెదురు చిగురు కాండాలను కూరలాగా వండుకుంటారు.
16. దుక్క పెండలం , కర్ర పెండలం కూడా వండుకుంటారు. 
17. తామర విత్తనాలు, తామర దుంపలు, నమ్మ (Aponogeton sps)దుంపలు కూడా వండుకో వచ్చు . 
తినే పుష్పాలు :  
Edible flowers: We know flowers for worship or for decorations or used as medicines. I wanted to introduce such edible flowers
1. Banana flowers:అరటి పూలు  Musa sapientum, M.acuminata, M.balbisiana, etc are edible.
the flowers are cooked as vegetable with dal, coconut etc.
2. Flowers of Senna occidentalis, Cassia occidentalis తంగేడు పూలు ; Cassia fistula రెల్ల పూలు are cooked with dal as vegetable.
3. Moringa /drumstic flowers: మునగ పూలు they are cooked like vegetable with dal.
4. Tamarind flowers:చింత పూలు like tender leaves, young fruits, tamarind flowers are cooked as vegetable, and to make chutneys etc.
5. Sesbania grandiflora : అవిసె పూలు like the leaves the flowers are cooked.     6. Rose petals: గులాబీరేకులు rose petals are widely used in sharbats, sweets, and gulkhand.
7. Margosa/neem flowers: వేపపూలు neem flowers are used in ఉగాది పచ్చడి Ugadipachadi, the fallen flowers are collected and dried, the dry flowers are used to make chutney or cooked with tamarind to make a side dish.
8.Clitoria ternata: Shanku pushpaalu శంకుపుష్పాలు the blue coloured flowers are used to make tea; it is refreshing.
9. Bombax ceiba : red cotton tree or కొండబూరుగ ; the flower buds are cooked as vegetable.
10. Oroxylum indicum:Indian trumpet flower; డుండిలము    the flower buds are cooked as vegetable. 
11. Cucurbita maxima, Cucurbita pepo: Pumpkin తియ్య/పెద్ద  గుమ్మడి పూలను cooked as vegetable with basin, coconut etc. 
12. Hibiscus sabdarifa గోంగూర పూలు the flower buds are cooked like chutney.
     Our wild fruits : regu (Zyziphus jujuba,Z.nummularis); neredu (Syzyzium cumini, S.alternifolium) vaaka, kale kaayalu (Carissa carandus, C.spinarum),pemu pandlu (Calamus rotang) vooti pandlu (Diospyros ferrea), pariki (zyziphus oenoplea),eetha (Phoenix sylvestris) Jana (Grewia asiatica),Nakka regy (Flacourtia indica), to be continued  
మన కూరగాయలు : మన తెలుగు వాళ్ళు సాధారణం గా వాడే కూరగాయలు:
దోస జాతి కూరలు: 1. బూడిద గుమ్మడి: Benincas hispida : దీన్ని కూరగా, సాంబారులో, వడియాలుగా, తీపి పదార్ధాల తయారీ కి వాడుకుంటారు. ఇది కడుపులో అల్సర్లు కలవాళ్ళకు మంచిది. 
 2. తీపి గుమ్మడి లేదా పెద్ద గుమ్మడి: Cucurbita maxima;పొట్టిగుమ్మడి Cucurbita pepo: ఎర్ర గుమ్మడి:Cucurbita maxima: వీటిని కూరగా, సాంబారులో, తీపి పదార్ధాల తయారీ కి వాడుకుంటారు. దీనిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది.తీయగా రుచిగా ఉంటాయి. 
3. పొట్లకాయ Trichosanthes anguina : వీటిలో పొడవు పొట్టి రకాలున్నాయి . కూరగా ప్రసిద్ధి. 
4. దోస కాయ : Cucumis melo L.var. utilissimus, : వీటిలో వివిధ రకాలున్నాయి . కూరగా ప్రసిద్ధి.
5.సొర/ఆనప కాయ:Lagenaria siceraria:వీటిలో వివిధ రకాలున్నాయి . కూరగా ప్రసిద్ధి.
6. బీర కాయలు : Luffa acutangula: కూరగా ప్రసిద్ధి.
7. కీర కాయలు Cucumis sativa
8. దొండకాయలు : Coccinia grandis 
9. కాకర కాయలు : Momordica charantia 
10. ఆగాకార : Momordica dioica
11. సీమ వంకాయ, చౌచౌ:  Sicyos edulis  
12.టిండా: Praecitrullus fistulosus :  ; ఈ కాయలు ఉత్తర భారత దేశము లో దొరుకుతాయి; అపుడపుడు మన supermarkets లో కూడా దొరుకుతాయి 
13. పర్వల్ : Trichosanthes dioica 

చిక్కుడు జాతి కూరలు:
1. పందిరి చిక్కుడు : Lablab purpureus subsp. bengalensis ;
Lablab purpureus subsp. purpureus
2. గోరుచిక్కుడు,or మొటిక్కాయలు: Cyamopsis tetragonoloba
3. French beans/బీన్సు కాయలు : Vicia faba; Phaseolus vulgaris
4. అలసంద కాయలు: Vigna unguiculata
5. బఠాణి : Pisum sativum
ఇతర రకాలు 
మిరప కాయలు : Capsicum annuum
కూర మిరప, bell pepper: Capsicum annum L. var. grossum
టమోటా :Lycopersicon esculentum
వంకాయలు: Solanum melongena L. var. Melongena
జీడిమామిడి,ముంతమామిడి: Anacardium occidentale
మామిడి: Mangifera indica
బెండ కాయ: Abelmoschus esculentus
మునక్కాయలుMoringa oleifera
క్యాబేజి: Brassica oleracea L. var. capitata
కాలీఫ్లవర్: Brassica oleracea var. botrytis
నూల్కోల్: Brassica oleracea L. var. gongylodes 
అరటి: Musa paradisiaca, Musa balbisiana
గోంగూర: Hibiscus cannabinus
ఎర్రగోంగూరHibiscus sabdariffa 
ఉసిరి/ ఉసిరిక: Phyllanthus emblica
రాచ ఉసిరిక: Phyllanthus acidus
దుంపకూరలు 
ముల్లంగి : Raphanus sativus
బంగాళాదుంపలు : Solanum tuberosum
బీట్రూట్:  Beeta vulagaris
క్యారెట్: Dacus carota
కందగడ్డమంచికంద:Amorphophallus paeoniifolius
చామగడ్డ:Colocasia esculenta
దుక్కపెండలం: Dioscorea alata
పెండలం: Dioscorea bulbifera,Dioscorea esculenta, Dioscorea cayennensis var. rotundata
Casava/ఆళ్వారి గడ్డలు : Manihot esculenta
చిలగడ దుంప/గెణుసు గడ్డలు : Ipomoea batatas 
Arrowroot: Maranta arundinacea
ఉల్లి పాయలు: Allium cepa
వెల్లుల్లిపాయలు: Allium sativum
అల్లము: Zingiber officinale
మామిడల్లం: Curcuma amada
నిమ్మజాతి ఫలాలు  
నిమ్మ: Citrus aurantiifolia 
నారింజ, కిచిలీ:Citrus aurantium
దబ్బ కాయ: Citrus limon
పంపరపనస: Citrus maxima 
      
contd......... 
          


  

Millets, Pulses, Oilseeds, Spices-చిరు ధాన్యాలు , పప్పు దినుసులు , నూనెగింజలు, సుగంధ ద్రవ్యాలు

మనం తినే ఆహారం లో పిండి పదార్థాలు , మాంసకృతులు , కొవ్వులు ఎక్కువ పాళ్ళలో కావాలి . వీటితో పాటు అనేక పోషకాలు తక్కువ పాళ్ళలో కావాలి. తెల్లబియ...